బెంగుళూరులో భోజనాల గోల  

Posted by దైవానిక

బెంగుళూరులో " ఆంధ్రా స్టైల్ భోజనం" అన్న బోర్డ్ పెడితే చాలు, జనాలు తండోపతండాలుగా ఎగబడతారు. బోర్డ్ ఒక్కటి చాలు, లోపల మనం పచ్చ గడ్డి పెట్టినా సుబ్బరంగా చెల్లుతుంది. ఇక గొందుకి రెండు ఆంధ్రాస్టైల్ పూటకూళ్ళ దుకాణాలు. ఇక ఆంధ్రాస్టైల్ అని పెట్టాక గోంగూర, ఆవకాయ ఉండాలి కదా. అవి ఒక రెండు డబ్బాలు పడేస్తారు. అవితింటే ఇక జన్మలో వాటి జోళికి వెళ్ళరు . ఇక అరిటాకులో వడ్డనలు స్టార్ట్. అంటె అన్ని అలా అని కాదు . కాని చాలా వరకు అంతే.

ఇలాంటి భోజనం ఇలా ఎగబడి ఎలా తింటారా అనుకునేవాణ్ణి. ఇక హోటల్లకి వారాంతంలో వెళ్ళామా అంతే సంగతి. తిరుపతి పంక్తులు దేనికి పనికిరావు. కాని అక్కడ తినేవారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తారు. నలుగురికి తక్కువ కాకుండా, పిల్లలని వేసుకొని బయలు దేరతారు. ఇలాంటి బిజి జీవితంలో ఒకరితో ఒకరికి సమయం దొరకడమే తక్కువ. అలాంటి సమయంలో చక్కగా కలిసి వండుకు తింటే ఎంత సుఖం, ఆ నానా గడ్డి తినే బదులు.
మా శతమర్కటులకయితే తప్పదు మరి. వంటలు రావు వచ్చినా చేసుకునే సదుపాయాలు ఉండవు.

ఈ వేళ దాదాపు అరగంట వేచినాక సీటు దొరికింది. ఆ లైన్లొ బ్రహ్మచారుల్లాగా ఉన్నవాళ్ళు దాదాపుగా లేరు. దీని బట్టి నాకర్థమయ్యిందేంటంటే, బ్రహ్మచారులు ఎంచక్కా వంటలు చేస్తున్నారు. గృహస్థలు పూటకూళ్ళ దుకాణాలెమ్మట పడుతున్నట్టున్నారు. మా చిన్నప్పుడయితే ఎప్పుడు హోటల్ లో తిన్న జ్ఞాపకాలు లేవు. కాని ఇప్పుడు ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా బయటకి వెళ్ళాల్సిందే. ఇలా గృహస్థులు మాకు పోటి వస్తే మా పరిస్థితి ఏం కాను??? స్వతంత్ర భారతదేశంలో కనీసం ఇష్టం వచ్చినట్టు భొజనం చేసే హక్కు లేదా అని నిలదీస్తే నేనేమి చెయ్యలేను :)

This entry was posted on 4, మే 2008, ఆదివారం at 6:44 PM . You can follow any responses to this entry through the comments feed .

9 comments

అజ్ఞాత  

గృహస్థులు వారా౦త౦ మాత్రమె హొటెల్ కు వెలతారు....

రోజు హొటెల్ లొ తినే ..మాలా౦టి బ్రహ్మచారులకు .వారా౦త౦ కాస్త వ౦డుకొనె టైమ్ దొరుకుతు౦ది ...వారా౦త౦ మాత్రమె మేము ఇ౦ట్లొనె ...వ౦డుకు౦టము.....

5 మే, 2008 10:07 AMకి

బహుశా, మీరు నాగార్జున రెస్టారెంట్ కెళ్ళారనుకుంటా! అక్కడ వాడు మనకు సీటు ఇచ్చే సరికి ఆకలి చచ్చూరుకుంటుంది. నందినిలో అయితే గోంగూర పచ్చడి తుప్పు పట్టి ఉంటుంది గనక అక్కడికి వెళ్ళకండి.అయినా మా మీద అక్కసు పడకపోతే, మీరు రోజూ బయటే ఇంటారు కదా, వారాంతాలు ఇంట్లో వొండుకుని రెస్టారెంట్లన్నీ గ్రుహస్తులకొదిలేయొచ్చు కదండీ పాపం!

5 మే, 2008 11:37 AMకి
అజ్ఞాత  

బాగా చెప్పారు. నాకింకో అనుభవం. శని, ఆది వారాల్లో సదరు ఆంధ్రా స్టైలు లొ వెళ్ళి, కేవలం భోజనం (నో చికెన్ వగైరా) అన్నామనుకోండి. మిమ్మల్ను, పురుగుల కన్నా హీనంగా చూస్తారక్కడ.

5 మే, 2008 1:53 PMకి

రెడ్డి గారు, అదౄష్టవంతులు. వంట చేసుకునే సదుపాయం ఉంది మీకు.
సుజాత గారు, అక్కసు కాదండి. మీరు ఎంచక్కా వంట చేసుకోవచ్చు కదా .. మాకు పోటి వస్తున్నారనే నా భాద
రవి గారు, అవునండి. వాడు గుచ్చి గుచ్చి అడుగుతాడు "సైడ్ డిష్ సార్ " అని. ఏదో తినకపోవడం ఘోరపాపం అయినట్టు.

5 మే, 2008 4:11 PMకి

వారాంతాలన్నా మమ్మల్ని సావకాశంగా భోజనం చెయ్యనిచ్చేలా లేరు మీరు :)
మరీ అంత తిట్టుకుంటూ ఆ చెత్త తినాలా?మేము కూడా బెంగుళూరు వచ్చినప్పుడు ఆంధ్రా భోజనానికి వెళితే తెలిసింది ఆంధ్రా స్టైల్ అంటే..... వేగని బెండకాయ వేపుడు,చారు,ఆర్చుకుపోయిన గోంగూర పచ్చడి,అరిటాకు అని.

5 మే, 2008 8:49 PMకి

సరైన తిండి దొరక్క బెంగుళూరులో మాత్రమే నేను ఇబ్బందిపడ్డాను. హైదరాబాదు నా దృష్టిలో అన్నపూర్ణ.

6 మే, 2008 7:36 AMకి

రాధిక గారు, తప్పదు. మరి వేరే గతి లేదు కదా..

రానారె గారు, నేనెప్పుడు హైద్రాబాదులో ఉండలేదు లెండి. బెంగుళూరులో మాత్రం బాగానే ఇబ్బంది.

6 మే, 2008 10:47 AMకి
అజ్ఞాత  

మరి వీక్ డేస్ లలో ఎలాగూ భార్యలు వంట చేస్తున్నారు కాబట్టి వీకెండ్స్ లో భర్తలు వంటలు చేస్తే గృహస్థులు ఏ హోటళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ? ;)
బైదవే 'కర్రీ పాయింట్ ' అని ఇప్పుడు ఎక్కడ చూసినా ఉన్నాయి అంట కదా ప్యాకెట్ వచ్చి 5 రూపీస్ అంట. వైఫ్ హజ్బెండ్ ఉద్యోగాలు చేసే వాళ్లకి ఇది ఒక కల్పవృక్షం లాంటిది అట. అలాగే హౌస్ వైఫ్ లకు ఇంట్లో వంట చేయాలంటే విసుగు వచ్చినప్పుడు కర్రీ పాయింట్ కి వెళ్ళి ఒక కూర , పప్పు ప్యాకెట్లు తెచ్చుకొని తింటున్నారంట హోటళ్ళకి వెళ్ళే బదులు :)

9 మే, 2008 5:40 AMకి

నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow

21 జులై, 2019 8:43 PMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి