ధనమేరా.........  

Posted by దైవానిక

నాకు ఎంతో ఇష్టమైన పాటలలొ, ఇది ఒకటి. ధనము, దాని విలువ గురించి ఎంతో బాగా వ్రాసారు. ముఖ్యంగా కొన్ని వాఖ్యాలు అద్భుతం. "ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా ", "శ్రమజీవికి జగమంతా లక్ష్మి నివాసం"

వ్రాసినది:(తెలియదు)
పాడినది: ఘంటసాల
చిత్రం: లక్ష్మి నివాసం.

ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం

మానవుడె ధనమన్నది సృజియించెనురా
దానికి తానె తెలియని దాసుడాయెరా!
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడపెట్టరా
కొండలైన కరగి పోవు కూర్చొని తింటె
అయ్యో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటె.

కూలివాడి చెమటలోన ధనమున్నది రా
కాలి కాపు కండల్లొ ధనమున్నది రా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీ దేవిని నిరసించుట తీరని దోషం.

పొరిగింటి పుల్లకూర  

Posted by దైవానిక

నేను మా నాన్నగారిని daddy అని పిలుస్తాను. మొన్నామధ్య నా స్నేహితుడు ఒకడు(అతను అరవం వాడు) మీ నాన్నని పశ్చాత్య దెశీయులు పిలిచినట్టుగా dad అని ఎందుకు పిలుస్తావు అని అడిగాడు. ఎందుకు అని అడిగితె ఎమి చెప్తాను. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అలానే పిలుస్తున్నాను. నాకు అది మన భాష కాదు అని తట్టనే లేదు. వాడు కూడ హైదరాబాదు లొ పుట్టి పెరిగాడు. నువ్వేకాదు నా స్నేహితులు చాలా మంది ఇలానే పిలుస్తారు అని కూడా చెప్పాడు. అప్పుడు నేను ఆలోచిస్తె నాకు అనిపించింది. నా తెలుగు స్నేహితులు చాలా మంది Daddy అని పిలుస్తారు. అలా పిలువని వాళ్ళలో చాలా మంది అమ్మ-నాన్న పెద్దగా చదువుకోలేదు. మెల్లమెల్లగా అందరు చదువుకుంటె ఇంక అమ్మ, నాన్న అనె పదాలు ఎక్కడ వినపడవేమొ? నిఘంటువు లోనుంచి తీసివెయాల్సిన అగత్యము రావొచ్చు. అది తలుచుకుంటేనె భయం వెస్తుంది.

నేను REC లొ చదువుకున్నాను. అక్కడ అన్ని రాష్ట్రాల వారు వుంటారు. ప్రతి రాష్ట్రానికి కొంత quota వుంటది. మన ఆంధ్రా quota నుంచి తెలుగు మాతృభాషగా లేనివారు వస్తుంటారు. అలాగె, వెరే రాష్ట్రాల quota నుంచి తెలుగు వారు వస్తుంటారు. ఆటువంటి వారికి తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు. వారి తెలుగు విన్న మనకి తెలుగు మీద, జీవితం మీద కూడ విరక్తి కలిగే అవకాశం వుంది. వారు వాల్ల అమ్మ నాన్న తోటి కూడ అంగ్లంలోనె మాట్లాడతారు. ఈ విధంగా మాతృభాష కనుమరుగవుతుంటె చివరకు ఎంత మంది మిగులుతారా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి కేవలం తెలుగుదేనా లేక ఇతర భాషలకు వర్తిస్తుందా అంటె, పెద్దగా వర్తించదు అనె చెప్పాలి. కన్నడిగలు మినహాయించి దాదాపు మిగతావారు మాతృభాషా ప్రియులె.

తెలుగువారికి పరాయిది ఎదైనా మహాప్రీతిపాత్రం. అందుకే అమెరికాలో వున్న భారతీయులలో తెలుగువారె అధికం. మా పిల్లలు mom dad అని పిలుస్తారు అని చెప్పుకోవడం మహా సరదా. మా పిల్లలు అమెరికాలొ వున్నారు అని చెప్పుకోవడం గర్వకారణం. నేను సెలవులకి, పండుగలకి ఇంటికి వెళితే, పొరిగింటివారు, బంధువులు అందరు అడిగేది ఒకె ఒక ప్రశ్న. అమెరికాకి ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడ లేనిది, అక్కడ వున్నది ఎంటి? మన వాళ్ళు మన నుంచి దూరంగా వుండటము ఇష్టమా?

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంతమంది తెలుగు వారము అన్ని దేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నాము కదా, అక్కడ అందరికి తెలుగు నేర్పించేస్తె? అప్పుడు తెలుగు అంతరించి పొతుంది అన్న బెంగ వుండదు. అప్పుడు తెలుగు mandarin భాష కంటె ఎక్కువ పాఠకులను సంపాదించి ప్రపంచములో చిరస్థాయిగా నిలుస్తుంది. "కలలా కరగడమా జీవితాన పరమార్థం" అన్నాడు సిరివెన్నల సీతారామశాస్త్రి. కావున కలలు ఆపేసి, తెలుగువారందరం తెలుగులోనె మాట్లాడుదాం. పిల్లల చేత అమ్మ-నాన్న అని పిలిపించుకుందాం.