కొన్ని దొరకాలంటే కొందరు వదులుకోవాలి ...  

Posted by దైవానిక

Thomas Friedman said in the New York Times :

"When we were young kids growing up in America, we were told to eat our vegetables at dinner and not leave them. Mothers said, think of the starving children in India and finish the dinner."

And now I tell my children:

'Finish your homework. Think of the children in India who would make you starve, if you don't."

ఇది ఎంత వరకు నిజమో ఆలోచించాలి. బాగా ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఈ రోజే నాకు మా మేనేజర్ ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడు. ఇప్పటి వరకు కలసి(మేము, అమెరికన్లు) చేసిన పనిని ఆగష్టు నుండి మనం మొత్తం ఇండియా లోనే చెయ్యాలి అని. అప్పుడు వెంటనే మేము అడిగిన ప్రశ్న, "అక్కడి వాళ్ళు ఏమి చేస్తారు?" అని. దానికి వాళ్ళని వేరే ప్రాజెక్ట్ లో వేస్తారు అని చెప్పాడు. అదే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకరి పొట్టలు కొట్టి మేము పొట్ట నింపుకుంటున్నాము అన్నఆలోచనే ఎంతొ బాధ కలిగిస్తుంది.

మనోబలానికి తార్కాణం  

Posted by దైవానిక


మోనికా సెలెస్, పేరు వినగానే అందరికి ఒకనాటి మేటి టెన్నిస్ క్రీడాకారిణి గుర్తొస్తుంది.

తను, అతిచిన్న వయసులోనే టెన్నిస్ WTA Rankings #1 కి చేరిన క్రీడాకారిణి

2
0 ఏళ్ళు దాటకమునుపే 9 గ్రాండ్ స్లాంలు గెలిచిన ఘనత ,
అతి చిన్న వయసులో( 16 ఏళ్లకే ) ఫ్రెంచి ఓపెన్ గెలిచిన ఘనత.
ఇలా ఇంకా ఎన్నో సాధించేదేమో ? కాని అంతా ఒక్క రోజులో, ఒక ఉన్మాది ****** చేతిలో నాశనం అయ్యింది. అంతకంటే బాధపడాల్సిన విషయం ఏమిటంటే, వాడికి కనీసం శిక్ష కూడా పడలేదు.

అంత జరిగినా, మళ్ళి పట్టుదలతో ఇంకొక్క గ్రాండ్ స్లాం గెలిచింది. మోనికా నీ మనోబలానికి ఇవే నా జోహార్లు.. ఎన్నాళ్లయిన నాకెంతో ఇష్టమైన టెన్నిస్ క్రీడాకారిణి నువ్వే.

ఈ మధ్యనే మోనికా తను టెన్నిస్ ఆట నుండి retire అవుతున్నట్టు ప్రకటించింది. మోనికా జీవితంలో ఇంకా ఎంతొ సాధించాలని కోరకుంటూ......

కొత్తొక వింత పాతొక రోత  

Posted by దైవానిక

కొత్తొక వింత పాతొక రోత అని మనమందరం విన్నాము కాని మనుషులకి కూడా అది వర్తిస్తుంది అని నేను ఊహించలేదు. మొన్న వారాంతము ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇద్దరు పాత స్నేహితులని కలిసాను. ఎంతొ ఆనందం వేసింది. సుమారుగా 10 సంవత్సరాల తరువాత వాళ్ళని కలిసే అవకాశం కలిగింది. కాని కలిసిన పది నిమిషాలకు మాట్లాడడానికి మాటలు మిగల్లేదు. అప్పట్లో ఎంతో సన్నిహితంగా ఉండే మేము ఇప్పుడు మాట్లాడుకోడానికి కూడా మాటలు రావట్లేదంటే ఎంత దురదృష్టం. ఎవర్నో కొత్త మనుషుల్ని కలిసినట్టనిపించింది. కాలం మనుషుల్లో ఇంత మార్పు తెస్తుందా?
తరువాత తీరిక దొరికినాక దీనికి కారణం ఏమయ్యుండవచ్చు అని బాగా ఆలోచించాను. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా కలిసే ప్రయత్నం చెయ్యకపోవడమే కారణం అని నిర్దారించాను.

10 ఏళ్ల క్రితం అంటే ఇంటర్నెట్ ఇంకా బాగా వ్యాప్తి చెందలేదు ఇక్కడ(భారతావనిలో). జనాలతో touch లో వుండాలంటే కేవలం ఉత్తరాలే దిక్కు .. కూర్చొని ఉత్తరాలు వ్రాయాలంటే కొంచం కష్టమే కదా! అందువల్లనో లేక చదువు రిత్యా/ఉద్యోగ రిత్యా బాధ్యత పెరిగి, సమయం దొరకకపోవడం వల్ల కూడా అయివుండవచ్చు.

ఇప్పుడు social networking బాగా వ్యాప్తి లోకి వచ్చింది. కనుక ఈ సమస్య భవిష్యత్తులో ఉండకపోవోచ్చు. కాని ఒక్కటి మాత్రం నిజం. కాలం మనుషులని బాగా మార్చెస్తుంది. అభిరుచులు మారుతుంటాయి. కాలంతో పాటు మనము మారడమే తప్ప వేరే చేయగలిగింది లేదేమో!!!!!