బత్తిబంద్ ....  

Posted by దైవానిక

బత్తి బంద్ మీద నేను వ్రాసిన వ్యాసం ఇక్కడ వచ్చింది. ఏదో వ్రాద్దామని మొదలెట్టి ఏదో వ్రాసినట్టుంది.
ఎలాగయితేనేం, అక్కడ ఒక కన్నెయ్యండి.

అమెరికాలో.... అష్టకష్టాలు  

Posted by దైవానిక in

కనీసం వారానికి రెండు టపాలయిన వ్రాసెయ్యలనుకున్నాను. కాని ఏంటో బ్లాగులు చదవడానికే సమయం చాలట్లేదు ఇంక ఎక్కడ వ్రాస్తాను. అష్టకష్టాలు అని చెప్పి ఈ సొల్లంతా చెప్తున్నానంటారా? అయితే అసలు పాయింట్ కి వచ్చేస్తాను.
ఏ నిమిషాన అమెరికాలో అడుగెట్టానో గాని ఒక్కటి తిన్నగా జరిగి చావటంలేదు. చెప్తే ఆశ్చర్య పోతారే్మొ గాని కనీసం డబ్బు లెక్కపెట్టడం కూడా రావట్లేదు. ఏ బిల్ల ఎంత విలువో కనిపెట్టేలోపు తాతలు దిగి వస్తున్నారు. ఎంచక్కా బిల్లకి అటువయిపో, ఇటువయుపో పెద్దగా సంఖ్యలెయ్యొచ్చుకదా!!! డైములంటారు, నికిల్లంటారు.. ఇక లాభం లేదని చిల్లరంతా బల్లమీద పోస్తున్నాను మీకు కావలిసినంత తీసుకోండని, ఇక్కడ పెద్దగా మొసాలు చెయ్యరని నమ్మకంతో. ఎలాగు ఇంకో రెండు వారాల్లో వెళ్ళి పోతున్నాను కదా! నేర్చుకోవాలని కూడా పెద్ద ఆసక్తి చూపట్ల. ఇంతటితో నా కష్టాలు తీరలేదు.
కూరలు , పాలు వగైరా కొందామని సూపర్ మార్కెట్ కి వెళ్ళా.. అన్ని పౌన్లలో ఉన్నాయి. అసలు ఎన్ని కొనాలో ఎన్ని కొంటె వారానికి సరిపోతాయో లెక్క మాత్రం తెలియలేదు. వీటికి తోడు రోడ్డుకు ఎటువయిపునుంచి బళ్ళొస్తున్నాయో కనిపెట్టి రోడ్లు దాటె సరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇక ఇదంతా వదిలి ప్రశాంతంగా ఏ ప్రదేశమో చూద్దామంటె, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నిల్లు. ఎక్కడికెళ్ళినా రెంటెడ్ కార్లో వెళ్ళాలంట. ఏదో ముక్కి ముక్కి ఒక రెండుసార్లు ఫేలయ్యాక మొన్ననే కారు బిల్ల వచ్చింది. అబ్బా అదేనండి డ్రయివింగ్ లైసెన్స్. మన భారతావనిలో వచ్చిన బిల్ల తోటి ఇక్కడ తోలదామంటె ధైర్యం చాలట్లా.. ఎందుకు రిస్కూ అంటూ ఠక్కున ప్రత్యక్షుమవుతున్నాడు Mr అంతరాత్ముడు. ఇలా అయితె ఇక నేను ప్రదేశాలు చూసినట్టె. పోని ఏది ఎంత దూరమొ కనుక్కొని ఆనందిద్దామంటె, ప్రతివాడూ మైళ్ళలో చెప్తున్నాడు. ఆ పదం మైలురాయిలో తప్ప ఎక్కడా విన్న జ్ఞాపకం కూడా లేదు. అసలెంత దూరమో తెలుసుకుందామని మన తెలుగు మిత్రులకి ఫోన్ చేస్తె, వాడు పెద్ద ఫోజుగా ఇన్ని మైల్లు అని చెప్పాడు. ఫోనంటె గుర్తొచ్చింది, ఇంకా ఫోను కష్టాలు చెప్పనే లేదు. మనం ఇండియాలో ఎంచక్కా ఫోన్ చేస్తె STD అయితె ముందు సున్నా కొడతాము కదా అని ఇక్కడ సున్న కొట్టె ప్రయత్నము చేసా.. ఒక్క ఫోను కలవట్లా.. అన్ని రాంగు నంబర్లని చెబుతుంది. తీరా కనుక్కుంటె ముందు ఒకటి పెట్టాలంట.

ఇలా అన్ని రకాల కష్టాలతోటి ఎలాగో నెట్టుకోస్తున్నానులెండి. మరి అంత పెద్ద కష్టాలుగా అనిపించట్లేదా.. అయితె బూతద్దాల లో చూడండి. పెద్దగా కనపడతాయి. నేనదే చేస్తున్నా కదా ప్రస్తుతానికి.

బెంగుళూరులో భోజనాల గోల  

Posted by దైవానిక

బెంగుళూరులో " ఆంధ్రా స్టైల్ భోజనం" అన్న బోర్డ్ పెడితే చాలు, జనాలు తండోపతండాలుగా ఎగబడతారు. బోర్డ్ ఒక్కటి చాలు, లోపల మనం పచ్చ గడ్డి పెట్టినా సుబ్బరంగా చెల్లుతుంది. ఇక గొందుకి రెండు ఆంధ్రాస్టైల్ పూటకూళ్ళ దుకాణాలు. ఇక ఆంధ్రాస్టైల్ అని పెట్టాక గోంగూర, ఆవకాయ ఉండాలి కదా. అవి ఒక రెండు డబ్బాలు పడేస్తారు. అవితింటే ఇక జన్మలో వాటి జోళికి వెళ్ళరు . ఇక అరిటాకులో వడ్డనలు స్టార్ట్. అంటె అన్ని అలా అని కాదు . కాని చాలా వరకు అంతే.

ఇలాంటి భోజనం ఇలా ఎగబడి ఎలా తింటారా అనుకునేవాణ్ణి. ఇక హోటల్లకి వారాంతంలో వెళ్ళామా అంతే సంగతి. తిరుపతి పంక్తులు దేనికి పనికిరావు. కాని అక్కడ తినేవారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తారు. నలుగురికి తక్కువ కాకుండా, పిల్లలని వేసుకొని బయలు దేరతారు. ఇలాంటి బిజి జీవితంలో ఒకరితో ఒకరికి సమయం దొరకడమే తక్కువ. అలాంటి సమయంలో చక్కగా కలిసి వండుకు తింటే ఎంత సుఖం, ఆ నానా గడ్డి తినే బదులు.
మా శతమర్కటులకయితే తప్పదు మరి. వంటలు రావు వచ్చినా చేసుకునే సదుపాయాలు ఉండవు.

ఈ వేళ దాదాపు అరగంట వేచినాక సీటు దొరికింది. ఆ లైన్లొ బ్రహ్మచారుల్లాగా ఉన్నవాళ్ళు దాదాపుగా లేరు. దీని బట్టి నాకర్థమయ్యిందేంటంటే, బ్రహ్మచారులు ఎంచక్కా వంటలు చేస్తున్నారు. గృహస్థలు పూటకూళ్ళ దుకాణాలెమ్మట పడుతున్నట్టున్నారు. మా చిన్నప్పుడయితే ఎప్పుడు హోటల్ లో తిన్న జ్ఞాపకాలు లేవు. కాని ఇప్పుడు ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా బయటకి వెళ్ళాల్సిందే. ఇలా గృహస్థులు మాకు పోటి వస్తే మా పరిస్థితి ఏం కాను??? స్వతంత్ర భారతదేశంలో కనీసం ఇష్టం వచ్చినట్టు భొజనం చేసే హక్కు లేదా అని నిలదీస్తే నేనేమి చెయ్యలేను :)