అమెరికాలో.... అష్టకష్టాలు  

Posted by దైవానిక in

కనీసం వారానికి రెండు టపాలయిన వ్రాసెయ్యలనుకున్నాను. కాని ఏంటో బ్లాగులు చదవడానికే సమయం చాలట్లేదు ఇంక ఎక్కడ వ్రాస్తాను. అష్టకష్టాలు అని చెప్పి ఈ సొల్లంతా చెప్తున్నానంటారా? అయితే అసలు పాయింట్ కి వచ్చేస్తాను.
ఏ నిమిషాన అమెరికాలో అడుగెట్టానో గాని ఒక్కటి తిన్నగా జరిగి చావటంలేదు. చెప్తే ఆశ్చర్య పోతారే్మొ గాని కనీసం డబ్బు లెక్కపెట్టడం కూడా రావట్లేదు. ఏ బిల్ల ఎంత విలువో కనిపెట్టేలోపు తాతలు దిగి వస్తున్నారు. ఎంచక్కా బిల్లకి అటువయిపో, ఇటువయుపో పెద్దగా సంఖ్యలెయ్యొచ్చుకదా!!! డైములంటారు, నికిల్లంటారు.. ఇక లాభం లేదని చిల్లరంతా బల్లమీద పోస్తున్నాను మీకు కావలిసినంత తీసుకోండని, ఇక్కడ పెద్దగా మొసాలు చెయ్యరని నమ్మకంతో. ఎలాగు ఇంకో రెండు వారాల్లో వెళ్ళి పోతున్నాను కదా! నేర్చుకోవాలని కూడా పెద్ద ఆసక్తి చూపట్ల. ఇంతటితో నా కష్టాలు తీరలేదు.
కూరలు , పాలు వగైరా కొందామని సూపర్ మార్కెట్ కి వెళ్ళా.. అన్ని పౌన్లలో ఉన్నాయి. అసలు ఎన్ని కొనాలో ఎన్ని కొంటె వారానికి సరిపోతాయో లెక్క మాత్రం తెలియలేదు. వీటికి తోడు రోడ్డుకు ఎటువయిపునుంచి బళ్ళొస్తున్నాయో కనిపెట్టి రోడ్లు దాటె సరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇక ఇదంతా వదిలి ప్రశాంతంగా ఏ ప్రదేశమో చూద్దామంటె, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నిల్లు. ఎక్కడికెళ్ళినా రెంటెడ్ కార్లో వెళ్ళాలంట. ఏదో ముక్కి ముక్కి ఒక రెండుసార్లు ఫేలయ్యాక మొన్ననే కారు బిల్ల వచ్చింది. అబ్బా అదేనండి డ్రయివింగ్ లైసెన్స్. మన భారతావనిలో వచ్చిన బిల్ల తోటి ఇక్కడ తోలదామంటె ధైర్యం చాలట్లా.. ఎందుకు రిస్కూ అంటూ ఠక్కున ప్రత్యక్షుమవుతున్నాడు Mr అంతరాత్ముడు. ఇలా అయితె ఇక నేను ప్రదేశాలు చూసినట్టె. పోని ఏది ఎంత దూరమొ కనుక్కొని ఆనందిద్దామంటె, ప్రతివాడూ మైళ్ళలో చెప్తున్నాడు. ఆ పదం మైలురాయిలో తప్ప ఎక్కడా విన్న జ్ఞాపకం కూడా లేదు. అసలెంత దూరమో తెలుసుకుందామని మన తెలుగు మిత్రులకి ఫోన్ చేస్తె, వాడు పెద్ద ఫోజుగా ఇన్ని మైల్లు అని చెప్పాడు. ఫోనంటె గుర్తొచ్చింది, ఇంకా ఫోను కష్టాలు చెప్పనే లేదు. మనం ఇండియాలో ఎంచక్కా ఫోన్ చేస్తె STD అయితె ముందు సున్నా కొడతాము కదా అని ఇక్కడ సున్న కొట్టె ప్రయత్నము చేసా.. ఒక్క ఫోను కలవట్లా.. అన్ని రాంగు నంబర్లని చెబుతుంది. తీరా కనుక్కుంటె ముందు ఒకటి పెట్టాలంట.

ఇలా అన్ని రకాల కష్టాలతోటి ఎలాగో నెట్టుకోస్తున్నానులెండి. మరి అంత పెద్ద కష్టాలుగా అనిపించట్లేదా.. అయితె బూతద్దాల లో చూడండి. పెద్దగా కనపడతాయి. నేనదే చేస్తున్నా కదా ప్రస్తుతానికి.

This entry was posted on 16, మే 2008, శుక్రవారం at 9:05 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

10 comments

బాగుంది (మీరు పడుతున్న కష్టాలను చూసి అనట్లేదు ... మీరు రాసిన విధానం చూసి అంటున్నా):)

16 మే, 2008 6:32 PMకి

తిలక్, యండమూరి లాంటి వాళ్ల రచనలు బాగా చదివినట్లున్నారే. మీ గురించి మీరు రాసుకుంది చూస్తుంటే అనిపించింది.

http://anilroyal.wordpress.com

16 మే, 2008 11:58 PMకి
అజ్ఞాత  

It will be like that initially. But you will get used to it slowly! After some time, if you go back to India, you will have another shock!

BTW, to convert miles to km, simply add half the original value. That will give a rough approximation to kilometers. So 48 miles = 48 + half(48) km = 72 km. It is only an approximation, but good enough for all practical purposes!

17 మే, 2008 4:32 AMకి

:) మీ బాధలు చూసి కాదులెండి నవ్వుతున్నది,మీ రాతలు చూసి

17 మే, 2008 10:19 AMకి

ఏం వ్రాయాలో కూడా తెలియడంలేదు. :) అంటే బాగుండదు. :( అందామంటే ఇది నా అనుభవం కాదు.

17 మే, 2008 11:44 AMకి

అబ్రకదబ్ర - తిలక్ నీ, యండమూరినీ వొకే వాక్యంలో పెట్టడానికి చేతులెలా వచ్చాయండీ?
దైవానిక - వారెవరో మైలు - కిమీ చెప్పిన సూచన బావుంది. బరువుల్లో ఒక పౌను అంటే సుమారు అరకిలో. ద్రవ పదార్ధాల కొలత కొంచెం అయోమయం. సుమారుగా క్వార్టు = 1 లీటరు. ఒక గేలనుకి నాల్గు క్వార్టులు. 16 ఔన్సులు = క్వార్టులో సగం = సుమారు అర లీటరు.

17 మే, 2008 6:19 PMకి

సురేందర్ గారు, నెనర్లు.
అబ్రకదబ్ర, పెద్దగా చదవలేదు లెండి. కాని మీరు భలె ఇద్దరిని కలిపారు :)
అనామకుడు గారు, ధన్యవాదాలు ..
రాధిక గారు, సంతోషం అండి.
రాఘవ గారు, ఏమి వ్రాయాలో తెలీక ఎదో ఒకటి వ్రాసారు. నెనర్లు
కొత్తపాళి గారు, అంత పెద్ద లెక్క చెప్పారు. ఇప్పుడవన్ని గుర్తు పెట్టడం కష్టమే :)

17 మే, 2008 10:45 PMకి

ఈ వ్యాఖ్య ఈ టపా గురించి కాదు.

తిలక్‌ని యండమూరి ని ఒకే గాట కట్టిన అబ్రకదబ్ర గారి వ్యాఖ్య

కొన్నేళ్ళ క్రితం యండమూరిని, గోపిచంద్‌తో (సినిమా నటుడు కాదు, రచయిత గోపిచంద్)పోలుస్తూ ఆంధ్రజ్యోతి ఒక వార్త పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. "ఆంధ్రజ్యోతి" పోగాలము దాపురించిందని ఆ రోజుల్లొ అనుకున్నారు. నిజంగానే అది జరిగింది. (యాజమాన్యం మారింది).

19 మే, 2008 6:41 AMకి

సారీ అండి! ఎదుటి వారి కష్టాలు చూసి నవ్వకూడదంటారు కానీ, ఏం చేయను? హైదరాబాదులో నల్లకుంట శంకర్ మఠ్ దగ్గర ఒక సారి రోడ్డు దాటడం వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బలే వీజీ!

అబ్రకదబ్ర! తిలక్ వెన్నెల! యండమూరి ఫ్లోరసెంట్ లైటు. వెన్నెల ఎప్పటికీ బోరు కొట్టదు. ప్రతి శుక్ల పక్షమూ కొత్తగా ఉంటుంది.

19 మే, 2008 12:10 PMకి

chala baagundi...meeru raasindi chaduvuthunte...kallaara chusi natlu vundi

21 జనవరి, 2011 6:06 PMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి