కళ్ళికోట కథాకేళి  

Posted by దైవానిక in

గమనిక: ఈ కథలో పాత్రలు సంఘటనలు కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించినవి కావు. ఎవరికయినా ఉద్దేశించినట్లనిపిస్తె వాడె రెనా.

స్థలం: కళ్ళికోట ఇంజినీరింగ్ కళాశాల
సమయం: మొదటి సంవత్సరం, రాగింగ్ సమయం

రాజు తనకు సీనియర్లు చెప్పిన విషయం అందరికి చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేసాడు. ఆందరూ వచ్చాక విషయం చెప్పాడు. వచ్చె ఆదివారం తెలుగు అసొసియేషన్ వార్షిక సమావేశాలు. కనుక మొదటి సంవత్సరం విధ్యార్థులు ఒక నాటిక ప్రదర్శించడం ఆనవాయితి. అక్కడ కళ్ళికోటలో వున్న చాలా మంది కుటుంబీకులు ఆ సమావేశాలకు వస్తారు. కనుక బూతులు లేకుండా మంచి నాటిక వెయ్యమన్నారు. బాగోకపోతే పగిలిపోద్దన్నారు. twist ఏంటంటే పద్నాలుగు మంది వుండాలి ఆ నాటకంలో. అందరు మోహాలు మాడిపోయాయి. అసలే సీనియర్లు చండశాసనులు. తేడా వస్తె కుమ్మేస్తారు. ఇప్పుడు 14 మంది వున్న నాటకం ఎక్కడ దొరుకుతుంది అని కొందరు సామాన్యులు వాపోయారు.
ఎవరి పేరు చెప్తె బండ బూతులు తిట్టాలనిపిస్తుందో, ఎవరు పేరు చెబితె సీనియర్లకు కొట్టాలనిపిస్తదో, వాడి పేరు రేనా ( caption :వాడిది రాయలసీమ కాదు). కాని లారి జనాన్ని దించి సీనియర్లను ఏసేద్దమని చూసాడు. సామాన్యుల ప్రార్థన మీద ప్రయత్నం విరమించి శాంతించాడు. ఇక అసలు విషయానికి వస్తె, రేనా విషయం విన్నాక, కెవ్వున అరిచాడు. ఆ దెబ్బకి అప్పుడే నిద్రలోకి జారుతున్న విష్ణు శాస్త్రి ఉలిక్కి పడి లేచాడు. అందరి మొహాలు పేలవంగా ఉండటం చూసి విషయం కనుక్కున్నాడు. అదేంటో సమావేశం లో " స" వినగానే గురక శబ్దం వినిపిస్తుంది అందరికి. ఎందుకు అరిచాడో ఎవరు అడగకపోయె సరికి, తనే మనసులో మాట చెప్పాడు రెనా. తనే ఒక నాటిక వ్రాస్తానన్నాడు.

సామాన్యుడు 1: ఏరా నువ్వు నాటకాలు కూడా వ్రాస్తావా?
రెనా: అదేమయిన బ్రహ్మ విద్యా. సరిగ్గా నాలుగు గంటలు కూర్చుంటే అయిపోద్ది. నాకు రేపొద్దున్న దాకా టైం ఇవ్వండి. ఒక కత్తిలాంటి నాటిక తయారు చెస్తాను.
సామాన్యుడు 1: ఉరేయ్, 14 మంది ఉండాలి చూసుకో.

ఇక చేసేది లేక అందరు రేనా నాటిక కోసం తెల్లవారు కలుద్దామని బయలుదేరారు. గాండ్రిస్తున్న విష్ణుని లేపి గదికి పంపారు.
రెనా కనీసం పేపర్ కూడ లేకుండా వచ్చాడు తరువాత రోజు.

రాజు: ఉరేయ్, నాకు చాలా Tension గా ఉంది. నాటిక తలుచుకుంటేనె వణుకేస్తుంది. ఇంతకి నాటిక ఎక్కడ?
రెన: why fear? i am here. నాటిక అంతా నా బుర్రలో ఉంది. అందరూ రాగానే బయటకు లాగుతా. విష్ణుకి వినిపించా.. సూపర్ అన్నాడు.
రాజు. వాడు మెలుకువగా వున్నప్పుడె చెప్పవా??

అందరూ వచ్చారు. రెనా మెల్లగా గొంతు సవరించుకున్నాడు. ఇంతలో సన్నగా గురక శబ్దం వినిపించింది. సమావేశం మొదలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే..
నాటిక మొదలుపెట్టమని రెనా వైపు చూస్తున్నారు అందరు. రెనా మొదలెట్టపోతుండగా

సామాన్యుడు 2: ఏర ఇది మొదటి సీనా?
రెనా: లేదు మామ ఎక్కడైనా పెట్టొచ్చు.
సామాన్యుడు 2: ఆ! ( షాకుతో ఫిట్సొచ్చినట్టున్నాయి)
ఇక సీనులోకి వెళితె, ఒక టీ కొట్టు. ఒకడు టీని రెండు గ్లాసుల్లొకి తిరగబోస్తున్నాడు. ఒకడు టీ తాగుతున్నాడు, ఒకడు ఊరికే నడుస్తూ ఉన్నాడు.

సామాన్యుడు 3: ఆ తరువాత?
రెనా: కాస్త డమ్మి.
సామాన్యుడు 3: అంటె?
రెనా: అంటె అక్కడ కాస్త డమ్మిగా ఎదైనా వేద్దాము.
సామాన్యుడు 3: ఏమి వేద్దాము?
రెనా: అంతా నిక్కచ్చిగా ఆలోచించలేదు.
సామాన్యుడు 3: (మెల్లగా మూలుగుతూ) తర్వాత?

రెనా: వాళ్ళు వెళ్ళిపోతారు.
సామన్యుడు 4: అంటె మళ్ళి రారా?
రెనా: మళ్ళా ఎందుకు?
సామాన్యుడు 4: వాళ్ళకి డైలాగులు లేవా?
అయితె అందులో ఒక పాత్ర నాకు కావాలి అని రాజు గట్టిగా అరిచాడు. మళ్ళి విష్ణుకి మెలుకువ వచ్చింది.
రెనా: డమ్మి కలిపినప్పుడు డైలాగులు కూడ కలుపుదాము లే మామ.
సామాన్యుడు 4: (మూడొ వికేట్ ఫట్)

సామాన్యుడు 5: ఇట్లా ఇంకా ఎన్ని సీన్లున్నాయి?
రెనా: ఇంక 5 వున్నాయి.
సామాన్యుడు 5: ఎవరికైనా డైలాగులున్నాయా?
రెనా: అంతా డమ్మి.

(సమాప్తం)

This entry was posted on 14, ఫిబ్రవరి 2008, గురువారం at 7:09 PM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

0 comments

కామెంట్‌ను పోస్ట్ చేయండి