అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి......  

Posted by దైవానిక in

అనగనగా ఒక ఊరిలో ఒక రామచంద్రయ్య. భోజన ప్రియుడు. బుట్టెడు అరిసెలు తినటానికి పట్టెడు నిమిషాలు కూడా పట్టదు అతనికి. అతని ధర్మపత్ని విజయలక్ష్మి. మహా ఇల్లాలు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణిశ్రీ లాగా తయారు అవ్వాలనుకుంటది. భొజనం వండడం, ఇల్లు సర్దడం లాంటి చిన్న చిన్న పనులు మీద పెద్దగా ఆసక్తి చూపడానికి ఇష్టపడదు. కాని రెక్కాడితే కాని డొక్కాడని సంసారం మరి.

వీరికి ఒక శుభదినం పేపర్లో ఒక వార్త కనపడ్డది. అరవయ్యేళ్ళు నిండిన ఒకాయన కోట్లు సంపాదిస్తున్నాడట. పుస్తకాలు, కథలు వ్రాస్తూనే. అది చదివాక మనవాళ్ళ మనస్సులో ఏమి ఆలొచన పడ్డదో వేరే చెప్పక్కర లేదు. పట్టపగలే కలలు మొదలయినాయి. ఒక పెద్ద గది, గదికి సరిపడినంత డైనింగ్ టేబుల్. టేబుల్ మీద ఖాళీ దొరకనన్ని వంటకాలు. ఆహ! కాస్కొ నా రాజా! పక్కనే ఇంకొక గది. దానిలో రెండు పెద్ద పెద్ద బీరువాలు. ఒక దానిలో నగలు, ఇంకొక దానిలో చీరలు. అలా చూస్తూ కళ్ళు, కళ్ళు కలిసాయి. కలిసి వర్తమానంలోకి నడిసాయి. పొయ్యిమీద ఎదో మాడుతున్న వాసన. చక్కున విజయ వంటింటి వైపు పరిగుతీసింది. "ఖర్మరా నాయనా! మళ్ళీ మాడు కూడె . ఆ కథలేవో వ్రాసేసి, ఆ కోట్లు సంపాదిస్తె మంచి చేయి తిరిగిన ఒక వంటలక్కని పనిలో పెట్టుకొని కావలసినవి చేయించుకోవాలిరా బాబు" అనుకున్నాడు. వంటింట్లో విజయ కూడా ఆ కోట్లు వస్తె ఈ పాడు చాకిరి తప్పుతుంది. దర్జాగా తిని కూర్చొవచ్చు అని అనుకున్నది. ఇక్కడ పాఠకులకు ఒక సామెత గుర్తువస్తూ వుండవచ్చు... ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట.

మాడు కూర భొజనాలు అయినాక ఇద్దరు ఎవరి ఆలోచన్లు వారు చెప్పారు. కథలు సబ్జక్టు వేట మొదలెట్టారు. ఎంత ఆలోచించినా కథలు దొరకలేదు సుమీ. కథలు దొరకగపోగా రాత్రి కూరతొపాటు అన్నం కూడా మాడింది. అది చాలక ఒకరి కథని ఒకరు వెక్కిరించడం మొదలెట్టారు. కథ ఒక పంక్తి, దానికి విమర్శ పది పంక్తులు. విసిగి ఇద్దరు ఒక సంధికి వచ్చారు. ఇద్దరు కలిసి ఒకే కథ వ్రాద్దాము అని. వారి జీవితాల గురించే వ్రాద్దాము అని. ఒకరి creative space లోకి వేరొకరు వెళ్ళొద్దని. ముఖ్యముగా ఒక్కొక్కరికి 5 వాఖ్యాలు టార్గెట్. అటు తరువాత పక్కవారికి ఇచ్చెయ్యాలి.

ఆ కథ ఎలా వచ్చిందో చదివి తీరవలసిందే...

విజయ మొదలెtcట్టింది కథ, " పోద్దున్న నిద్రలేచి, తిండిపోతు మొగుడికి ఉపహారం చెయ్యడానికి వంటింట్లోకి వెళ్ళాను. అంతలో చీరల వాడి కేక వినపడ్డది. పండక్కి చీరలు కొనుక్కొమన్న ఆయన మాట గుర్తొచ్చి, మళ్ళీ కొనుక్కోకపోతే ఆయన బాధ పడతారని చీరలవాడి మూట దింపించాను. కొత్త చీరలు చాలా వున్నయి." తన 5 వాక్యాలు అయిపొయాయి అని గుర్తుచేసాడు.
"బాత్రూంలో నుంచి వచ్చే సరికి, చీరల వాడిని చూసి చిర్రేత్తుకొచ్చింది. వాడిని నాలుగు తిట్లు తిట్టి, మళ్ళి ఇంటి ఛాయల్లో కనిపిస్తే చంపుతా అని బెదిరించి పంపాను. ఆ రోజు Tiffin కింద ఉప్మా, మినపట్టు, చిల్లుగారెలు చేసింది విజయ. మధ్యాహ్నం వంటకి ఎమి చెయ్యాలి అని అడిగింది. పులిహొర, చక్రపొంగలి చెయ్యమన్నాను" విజయ పల్లు పటా పటా కొరుకుతూ తన వంతు వచ్చిందని గుర్తు చేసింది.
సరే ఆయన చెప్పిన వంటలు చేద్దాము అని వంటింట్లోకి వెళ్ళాను. తీరా చూస్తే, చింతపండు, పంచదార నిండుకున్నాయి. ఇక చేసేది లేక మామూలు వంటలు చెయ్యడానికి ఆయన కూడ ఒప్పుకున్నరు. వంటలు నచ్చి, ఎప్పుడూ నూంచో కొని పెడతానంటున్న రవ్వల నెక్లస్, కంచి పట్టుచీర ఈ వేళ సాయంత్రమే కొనిపెడతానన్నారు. డబ్బు తేవడానికి బాంకుకి కూడ వెళ్ళారు.
రామయ్య తన వంతు వచ్చిందని గొంతు సవరించి మరి చెప్పాడు. నీ సంగతి చెప్తానంటూ తను మొదలెట్టాడు. " డబ్బు తీసి, విజయని తీసుకొని కొనడానికి బయలుదేరాము. దారిలో ఒక దొంగ మమ్మల్ని బెదిరించి డబ్బు కాస్తా కాజేసి పొయాడు. విజయ ఒంటి మీద నగలు కూడా కొట్టేసాడు. విజయ ఇదంతా తనవళ్ళే జరిగిందని బాగా ఏడ్చి ఇక జన్మలో నగలు చీరలు అడగనని వేంకటేశ్వరుడు మీద ఒట్టేసింది. ఇక చేసేది లేక చింతపండు, పంచదార కొనుక్కోని ఇంటికి బయలుదేరాము"
విజయ కడుపు రగిలిపోయింది. తగిన శాస్తి చెయ్యలని మొదలెట్టింది. "ఇంటికి బయలు దేరి ఆటోలో వస్తుంటే పెద్ద accident అయ్యింది. నాకు పెద్దగా దెబ్బలు తగల్లెదు కాని, ఆయనికి బాగా తగిలాయి. ఆసుపత్రికి తీసుకెళితె అక్కడ doctor ఎవేవొ టెస్టులు చేసి ఆయనకు B.P, Sugar, ulcer వుందని తేల్చి చెప్పాడు. ఉప్పు కారం పులుపు తీపి తినకూడదని డాక్టరు గట్టిగా చెప్పాడు. ఇక ఆయన కూడ చేసేది లేక మానేస్తానని ఆ బెజవాడ కనకదుర్గ మీద ఒట్టేసాడు"

ఇక అంతే, కథ అక్కడికి చాలించి ఒకరి మీద ఒకరు రుస రుసలు మొదలు. నాలుగు రొజులు ఇద్దరికి మాటలు లేవు కూడా! ఇక మళ్ళీ కథల గురించి ఎప్పుడు ఆలొచించలేదు.


ముఖ్య గమనిక: ఈ కథ ఎప్పుడో చదివిన ఒక కథ మీద ఆధారపడి వ్రాసినది (అంటె, original కథ అసలు గుర్తు లేదు. 5 లైన్ల concept మాత్రము అక్కడ నుంచి తీసుకున్నదే. మిగతా అంతా నా కల్పితం). ఎవరు వ్రాసారు, కథ పేరు లాంటివి గుర్తు లేవు. తెలిసిన వారు చెప్పగలరు.

This entry was posted on 7, ఫిబ్రవరి 2008, గురువారం at 1:27 PM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

7 comments

ఎవరు రాసినా మీ కూర మాత్రం మాడలేదు. ఘుమఘుమలాడుతోంది. మీరేమనుకోపోతే ఇంకేవైనా ఐదు లైన్ల కూరలు ఉన్నాయా?

7 ఫిబ్రవరి, 2008 5:54 PMకి

బావుంది ప్రయోగం.

8 ఫిబ్రవరి, 2008 1:05 AMకి

మంచి కాన్సెప్టు. బాగా రాశారు. దీన్ని మీరు కొనసాగించి మరో నాలుగైదు భాగాలు రాయడానికి ప్రయత్నించవచ్చు.

8 ఫిబ్రవరి, 2008 1:33 AMకి

లైటుగా గమ్మత్తుగా చాలా బాగుంది కథ.

8 ఫిబ్రవరి, 2008 11:36 PMకి

విశ్వనాథ్ గారు,
కొన్ని మదిలో ఉన్నాయి. సమయం దొరికినప్పుడు మొదలెడతాను.

ప్రవీణ్ గారు, నెనెర్లు.

రానారె గారు,
కొనసాగించటానికి ప్రయత్నిస్తాను. ఇలా చిన్న కథలు వ్రాయాలనె నా ఉద్దేశం.

రాకేశ, నీకు మొదట చూపిన draft బాగుందా లేక ఇది బాగుందా? నన్ను బ్లాగ్లోకానికి పరిచయం చేసినందుకు నెనెర్లు.

11 ఫిబ్రవరి, 2008 11:03 AMకి

చాలా బాగుందండి... concept నచ్చింది...

14 ఫిబ్రవరి, 2008 4:03 PMకి

కథ చిన్నదైనా కాన్సెప్ట్ బావుందండి

14 ఫిబ్రవరి, 2008 8:26 PMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి