కొత్తొక వింత పాతొక రోత అని మనమందరం విన్నాము కాని మనుషులకి కూడా అది వర్తిస్తుంది అని నేను ఊహించలేదు. మొన్న వారాంతము ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇద్దరు పాత స్నేహితులని కలిసాను. ఎంతొ ఆనందం వేసింది. సుమారుగా 10 సంవత్సరాల తరువాత వాళ్ళని కలిసే అవకాశం కలిగింది. కాని కలిసిన పది నిమిషాలకు మాట్లాడడానికి మాటలు మిగల్లేదు. అప్పట్లో ఎంతో సన్నిహితంగా ఉండే మేము ఇప్పుడు మాట్లాడుకోడానికి కూడా మాటలు రావట్లేదంటే ఎంత దురదృష్టం. ఎవర్నో కొత్త మనుషుల్ని కలిసినట్టనిపించింది. కాలం మనుషుల్లో ఇంత మార్పు తెస్తుందా?
తరువాత తీరిక దొరికినాక దీనికి కారణం ఏమయ్యుండవచ్చు అని బాగా ఆలోచించాను. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా కలిసే ప్రయత్నం చెయ్యకపోవడమే కారణం అని నిర్దారించాను.
10 ఏళ్ల క్రితం అంటే ఇంటర్నెట్ ఇంకా బాగా వ్యాప్తి చెందలేదు ఇక్కడ(భారతావనిలో). జనాలతో touch లో వుండాలంటే కేవలం ఉత్తరాలే దిక్కు .. కూర్చొని ఉత్తరాలు వ్రాయాలంటే కొంచం కష్టమే కదా! అందువల్లనో లేక చదువు రిత్యా/ఉద్యోగ రిత్యా బాధ్యత పెరిగి, సమయం దొరకకపోవడం వల్ల కూడా అయివుండవచ్చు.
ఇప్పుడు social networking బాగా వ్యాప్తి లోకి వచ్చింది. కనుక ఈ సమస్య భవిష్యత్తులో ఉండకపోవోచ్చు. కాని ఒక్కటి మాత్రం నిజం. కాలం మనుషులని బాగా మార్చెస్తుంది. అభిరుచులు మారుతుంటాయి. కాలంతో పాటు మనము మారడమే తప్ప వేరే చేయగలిగింది లేదేమో!!!!!
డిజర్వేషన్లు ఇస్తే చలితులు మతం మారరు. అవునా? – 10
4 నెలల క్రితం