ఆవేశం ఆవేదన ఆక్రోశం  

Posted by దైవానిక

ఏమిటీ దారుణం?? ఎందుకీ మారణహోమం?? ఏం చేస్తుందీ ప్రభుత్వం??
ఏమీ చేయలేని నిస్సహాయత ఎందుకు??
బ్రతుకు భీభత్సం చేయడమే లక్ష్యమా??
తీవ్రవాద చరిత్రలోనే అతి దారుణమయిన సంఘటన జరిగిన రోజుగా, ఈ రోజు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. తీవ్రవాదములోనే ఒక వినూత్న పద్దతిని ప్రవేశపెట్టి, జనాన్నిభయ భ్రాంతులకి గురి చేసే సంఘటన. పోలీసు జీపులోనుంచి యథేచ్ఛగా కాల్పులు జరిపిన తీవ్రవాదం. హాస్పిటల్ల మీద బాంబులు విసరడం. ఇవన్నీ తలుచుకుంటేనే వెన్నుపూసలోంచి సన్నగా భయం పుట్టుకొచ్చి ఒళ్ళంతా వణుకుతుంది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం, ఏది చేసినా ఈ దారుణమే గుర్తురావడం, మనస్సు పడే అవేదన ఎవరికి చెప్పను. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదే??
అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా నీ లీలలు.. ఇంతా జరుగుతుంటే ఎక్కడున్నావయ్యా?? పూర్వ జన్మ పాపం అని సరిపెట్టుకుందామంటే మనస్సొప్పుకోవట్లేదేమయ్యా??

కరాచీ నుంచి బోటులో తీవ్రవాదులు రావటం ఏమి విచిత్రం?? అంత సులువుగా బోటులో ఆయుధాలేసుకొనెచ్చేసారే, ఇక ఈ దేశంలో భద్రత ఎక్కడుంది. ఇదేదో గోలకృష్ణ సినిమాలలోనే జరుగుతుందనుకున్నాను కాని, నిజంగా జరగుతుందని కలలో కూడా అనుకోలేదే.

ఏ చానల్ చూసినా ఈ కుల మత విచక్షణ చేసి మృతులను విడదీయడేమిటీ. అందరూ ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఏమి ఈ లెక్కలు స్వామీ?? మానవత్వం అని ఒకటుందనే మర్చిపోయినట్టున్నారే??
ఒక పక్క ఆర్థిక సంక్షోబంలో దేశం, ప్రపంచం కొట్టి మిట్టాడుతుంటే మధ్యలో తీవ్రవాదం నేనూ ఉన్నానని పలకరిస్తోందా ఏమిటీ??
హయ్యో ఏమి ఈ బాధ, తట్టుకోలేకున్నానే. ఇలా భయపెట్టడమే తీవ్రవాదులు లక్ష్యమైతే వారి కోరిక నెరవేరినట్టే. ఎంతో దూరాన ఉన్న నాకే ఇంత భయం వేస్తుంటే, అక్కడ ఉన్న జనం ఇంకెంత భయపడుతున్నారో.

ఏంటో మొదలెట్టి, ఏదో చెప్పి , ఎలా ముగిస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు.
ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలకు కొరత లేకుండా చూడాలని ఆ పరమాత్మకి దణ్ణం పెట్టుకోవడం తప్ప నేనేమి చెయ్యగలను. ఈ నిస్సహాయతని చూస్తే నా మీద నాకే అసహ్యం వేస్తోంది.

This entry was posted on 27, నవంబర్ 2008, గురువారం at 3:06 PM . You can follow any responses to this entry through the comments feed .

10 comments

అసహ్యంకాదు కోపం,ఆవేశం రావాలి. అప్పుడుగానీ పరిస్థితి మారదు.

27 నవంబర్, 2008 5:51 PMకి

ఆవేశం.. ఆవేదన.. ఆక్రోశం.. ప్రస్తుతానికి భారతీయులందరిదీ ఒకటే మనఃస్థితి.. :(

27 నవంబర్, 2008 6:17 PMకి

ఆవేశం తెచ్చుకోవడం చాలా ఈజీయే కానీ సామాన్యులు గా ఏం చేయగలం చెప్పండి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా!

దైవానిక,
మీ ఆవేదన, ఆక్రోశం 100% అర్థం అవుతోంది.

కానీ అసహ్యం వేయాల్సింది మీ మీద కాదు, కొంచెం ఆవేదన తగ్గాక అర్థం అవుతుంది ఎవరి మీదా ఏ స్థాయిలో వేయాలో!

27 నవంబర్, 2008 8:30 PMకి

భయ పెట్టడం వారి లక్ష్యమని తెలిసి కూడా భయపడడం దేనికి.
అలానే టీవీకి రెండు మూఁడు రోజులు దూరంగా వుడడం మంచిది. కావలసిన వార్తలు పేపరులో చదువుకోవచ్చు.

ఇక దేవుడైనా దానవుడైనా మనిషిలోనా గా వుండేది.

27 నవంబర్, 2008 9:12 PMకి

ఇది ప్రతి భారతీయుడు రగిలి పోయే ఉన్మాద చర్య.

9 డిసెంబర్, 2008 7:11 PMకి

mEkalu pululanu tarama galavani
cheemalu paamuni champa galavani
GaDDi parakale pEnaga traadi madagajaalanE nilupagalavanee
aikamatyam panche balamto balavantuni
EdirinchagalamanE
nitya satyanni marokka maru niroopinche kada sompeta

5 నవంబర్, 2010 1:38 AMకి

awesome........
Hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

16 జనవరి, 2017 5:14 PMకి

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

4 మార్చి, 2017 3:08 PMకి

latest news updates please visit http://clap2climax.com/

18 అక్టోబర్, 2017 2:37 PMకి

good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

13 ఏప్రిల్, 2018 2:20 PMకి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి