ఈ క్విజ్ ఎంటి అని అలొచిస్తున్నారా... అయితె ముందు ఇక్కడకి వెళ్ళాలి. సరె ఇక ఆసక్తి విషయానికి వస్తె, నా బ్లాగుకి ఒక 100 హిట్లు పెరిగాయి. కాని సమాధానాలు మాత్రం ఒక 5 గురి దగ్గర నుంచి మాత్రమే... సరె ఇక అసలు జవాబులు కి వచ్చేద్దాం.
1. భాగవతం ఎవరు, ఎవరికీ చెప్పారు.
భాగవతం మొదట్లొ, శౌనకాది మునులంతా సుత గొస్వామిని భగవంతుడి అవతారాల గురించి అడుగుతారు. అప్పుడు సుతుడు వారికి తను , శుఖదేవ గోస్వామి గారు పరీక్షిన్మహారాజు కి చెప్పగా విన్న భాగవతం చెప్తానంటాడు.
ఇప్పుడు జవాబు, రెండింట్లొ ఎదయినా కరెక్టే.
2. అర్జునుడు, అభిమన్యుడి చావుకి వీడె కారణం అని నిక్కచ్చిగా తేల్చి, చంపుతనాని శపథం కూడా చేసాడు.
జయద్రథుడు. ఇతడు సిందూ దేశానికి రాజు కనుక సైందవుడయ్యడు. ఇతడికి శివుడు ఒక వరం ఇస్తాడు. అర్జనుడు తప్ప మిగతా పాండవులని ఒక్క రోజు యుద్దంలొ కట్టడి చెయగలడు. దాని వల్ల అభిమన్యుడు పద్మవ్యూహం లో చనిపొయాడు. పూర్తి కథ మళ్ళా ఎప్పుడైనా చెప్తాను.
౩. గాథాసప్తశతి .
ఇది శాతవాహన రాజైన హాలవృచితుడు లేక హాలుడు రచించాడు. పేరులోనే ఉన్నట్టుగా అది మొత్తం 700 కథల సమాహారం. ముఖ్యంగా గమనించ వలసిందేంటంటే, ఆ కథలు అతను వ్రాయలేదు. కేవలం ఒకచోట చేర్చాడు.
4. సీత పెంపుడు తల్లి, భరత శత్రుగ్నుల ఇల్లాల్ల పేర్ల .
సీత తల్లి పేరు సునయనాదేవి.
భరతుడి భార్య మాండవి. శత్రుగ్నుడి భార్య శృతకీర్తి. వీరిద్దరి జనక మహారాజు తమ్ముని కూతుళ్ళు . అతను యుద్దంలో చనిపొయాక, జనకుడే సొంత కూతుళ్ళ లాగా చూసుకుంటాడు.
5. చాంద్రమాన మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి నాడు వచ్చే పండుగ
ఇది మహాశివరాత్రే. ఇక్కడ త్రయోదశి ఎందుకు ఉందంటే, ఉత్తర భారత దేశంలో కొందరు ఆ రోజు రాత్రి కూడ పూజలు చేస్తారంట.
6. చదరంగం కనిపెట్టింది.
మండోదరి. రావణాసురుడి భార్య. రావణుడు అస్తమానం యుద్దాలకు వెళ్తుంటే, తను ఊరికే ఇంట్లొ ఒక్కతే ఉండలేక చదరంగం కనిపెట్టిందట. రావణాసురుని ఓడించింది అని కూడా అంటారు మరి.
7. జటాయువు , సీతని ఎత్తుకుపోతున్న రావణుని తో పోరాడి ఇక్కడ పడి చనిపోయిందట
అది లేపాక్షి. పేరు లొ కూడ ఉంది చూడండి. రాముడు వచ్చి లే పక్షి అన్నాడంట. (అంటె రాముడికి తెలుగు వచ్చా అని సందేహం రావడం సహజం). ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ౧౫ కి.మి దూరం. బెంగుళూరు నుండి చాలా దగ్గర. తప్పక చూడవలసిన ప్రదేశం. దీని గూర్చి మళ్ళా ఎప్పూడైనా టపా వ్రస్తా.
8. చిట్టెలుక
చిఱు + ఎలుక. ఇక్కడ ద్విరుక్తటకారాదేశ సంధి జరిగింది.
ద్విరుక్తటకారాదేశ సంధి : కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు
ఇక్కడ వంశి మాగంటి గారు చెప్పిన వ్యాఖ్య తప్పక చూడండి. పరుచూరి శ్రీనివాస్ గారు, మీరు బహుమతి తప్పక ఇవ్వ వలసి వచ్చేట్టుంది.
9. జనక రాగాలు
ఇవి మొత్తం 72 . సప్తస్వరాలు కదా. అన్ని స్వరాలు ఉండే రాగాలని జనక రాగాలు అంటారు. వీటినే మేళకర్త రాగాలు అని కూడ అంటారు. 72 ఎలా వచ్చయొ తెలుసా?
10. అజంత భాష
తెలుగుతొ పాటు, ఇటాలియన్ కూడ అజంత భాష. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. మరి ఇటాలియన్ ని తెలుగు ఆఫ్ ద వెస్ట్ అని ఎందుకు అనరో?
సరే ఈ క్విజ్ కి సమాధానాలు పంపిన వారు , వంశి మాగంటి గారు, ఒక అనామకుడు గారు, సుజాత గారు , రాజశేఖర్ గారు మరియ ముక్కు శ్రీ రాఘవ కిరణ్ శర్మ గారు. ఎవరు ఎన్ని కరక్టో చెప్పాలంటారా?
మీ అందరికి నా తరుపున అభినందనలు మరియు నెనర్లు కూడా.
9 comments
పరుచూరి శ్రీనివాస్ గారు,
ఒక చిన్న చిక్కు వచ్చి పడ్డది. మొదట వ్రాసింది అనామకుడు. అతన్ని తీసెస్తె, సుజాత గారు, కిరణ్ శర్మ గారు కరెక్ట్ గా చెప్పరు. సుజాత గారు శకటరేఫం మర్చారు.
ఇక ఎవరొ మీరే చెప్పలి.
చూడబోతే! ఈ క్విజ్ నుంచి కనీసం అయిదు కొత్తా టపాలు వచ్చేట్టు ఉన్నాయి.
సమాధానలు... ధన్య్లలం...నెజ్జనులకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను..
మరి తరువాతి యక్షద్వారం(రెండొ క్విజ్) ఎక్కడ???
చంద్రమౌళి గారు, మికు క్విజ్ నచ్చినందుకు నెనర్లు. రెండవ భాగం త్వరలో(అంటె, ఒక 2-3 నెలల్లొ) వస్తుంది. ఇక అయిదు టపాల గురించి, చూద్దాం. ఎన్నొ అనుకుంటాం, అన్ని అవుతాయా చెప్పండి :)
దైవానిక గారు,
జనక మహారాజు భార్య పేరు నేను నా దగ్గరున్న ' పూర్వ గాథా లహరి ' లో చూసి రాసాను. (రాసింది..శ్రీ వేమురి శ్రీనివాసరావు గారు..వెంకట్రామా బుక్ డిపో వారి ప్రచురణ). నాకు తెలిసి పూర్వ గాథా లహరిలో, అందునా వెంకట్రామా బుక్ డిపో వారి ప్రచురణలో తప్పులుండడానికి అవకాశం లేదు. మరి సీత పెంపుడు తల్లి పేరు సునయనా దేవి అని రాసారు. అది మీరు ఏ రామాయణం ఆధారంగా చెప్పారో దయ చేసి తెలియచేయగలరా?
ఇంతకీ అజంత భాష అంటే ఏమిటో చెప్పండి. తెలుగుకీ, ఇటాలియన్ కీ పోలిక ఏమిటంటే, రెండు భాషల్లోని ఏ పదమైనా అచ్చులతోనే అంతమవుతాయి. (ఆంగ్లం అలా కాదు. హల్లులతో end అవుతాయి.) మరి అజంతా భాష అంటే ఏమిటొ తెలియలేదు.
సుజాత గారు, ముందుగా సులువైన ప్రశ్నకి జవాబు. అజంత భాష అంటే, భాషలో అన్ని పదాలు అచ్చుతోటే అంతమవుతాయి.
ఇక మొదటి ప్రశ్నకి వస్తె, నేను ప్రస్తుతానికి ఎ పుస్తకము రిఫర్ చెయ్యలేదు. కాని అంతర్జాలం లో వెతికినా, ముందు చదివిన వాల్మికి రమాయణం(ఎవరు వ్రాసారు, ఎవరు ప్రచురించారో తెలియదు) ప్రకారం కూడ ఇదె ఉందని గుర్తు. ఒక వేళ ఆవిడనే రత్నమాల అంటారో మాత్రం నాకు తెలియదు.
ఈ రత్నమాల పెరుతో అంతర్జాలం లో వెతికినా పెద్దాగా ఎమి దొరకలేదు. ఇంకా research చేసి చెబుతాను.
దైవానిక గారు,
ముందుగా క్విజ్ ఇచ్చినందుకు నెనెర్లు.
ఆ అనామకుడును నేనేనండీ.పొరపాటున లాగిన్ అవ్వకుండా సమాధానాలు పొష్టు చేశాను.ఈప్పుడె మళ్ళి కొంచం సమయం దొరికింది.
మొదట చూసినప్పుదు ప్రశ్నలలో పుష్య బహుళ త్రయోదశి అని వుంది.మాస శివరాత్రి అని అనుమాన వచ్చింది కాని అది కూడా చతుర్దశి నాడు వస్తుంది.
తర్వాత చూస్తే మాఘ... అని వుంది.
సమాధానాలలో అచ్చు తప్పులు దొర్లినట్టున్నాయి.దయచేసి వాటిని సరిదిద్దగలరు.శుఖుడును శుకుడు అని వ్రాయాలి.అంటే చిలుక ముఖం కలవాడు కనుక.
ఈ క్విజ్ ను ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ
కృష్ణుడు గారు, మీకు అభినందనలు. మీరు ఒక్ ప్రైజు గెలిచారు.
అవునండి, ముందు ప్రశ్న తప్పుగా వ్రాసాను. తరువాత కరెక్ట్ చెసాను.
అచ్చు తప్పులు గమనించాను. కరెక్ట్ చేస్తె కూడలి లో మళ్ళా వస్తుంది అని సంకోచిస్తున్నాను.
మీరు ఇలాగె ప్రోత్సహిస్తె ఇక నెలకొక క్విజ్ వస్తుంది.
కృష్ణుడు గారు, మీరు నాకు ఒకసారి వేగు పంపగలరా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
బూజు దులుపండి
వీడెవడండి బాబు

- దైవానిక
- సూర్యుని కిరణం నేను, సముద్రపు అలను నేను, నింగిలోని పక్షిని నేను, నేలలో వృక్షం నేను, గాలిలో సువాసన నేను, అగ్నిలో సెగను నేను, ఉరుములో శబ్దం నేను, దీపపు వెలుగుని నేను, అన్ని కలిపి దేవతల దండుని నేను.
నేడే చూడండి!!
-
డిజర్వేషన్లు ఇస్తే చలితులు మతం మారరు. అవునా? – 104 నెలల క్రితం
-
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల9 నెలల క్రితం
-
Ashray5 సంవత్సరాల క్రితం
-
కొసమెరుపురచయిత ఓ హెన్రీ ఇంట్లో కాసేపు ....11 సంవత్సరాల క్రితం
-
కొబ్బరి చిప్ప .... శాపం13 సంవత్సరాల క్రితం
-
నవంబరు గడి16 సంవత్సరాల క్రితం
బంధుమిత్ర సపరివారం
చదవడానికెందుకురా! తొందర
