ఈ రోజు ఎందుకో ఒక చిన్న క్విజ్ తయారు చేయాలనిపించింది. నాకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోవాలని నా చిన్న ప్రయత్నం ఇది. సమాధానాలు తెలిసిన వాళ్ళు నాకు వేగు పంపండి. దయచేసి సమాధానాలు వ్యాఖ్యల బాగంలో వ్రాయకండి. మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే తప్పక వ్యాఖ్య వ్రాయండి.
1. అసలు భాగవతం ఎవరు, ఎవరికీ చెప్పారో తెలుసా?
2. అర్జునుడు, అభిమన్యుడి చావుకి వీడె కారణం అని నిక్కచ్చిగా తేల్చి, చంపుతనాని శపథం కూడా చేసాడు.
3. గాథాసప్తశతి ఎవరు వ్రాసారో తెలుసా?
4. సీత పెంపుడు తల్లి పేరు (అంటే జనక మహారాజు భార్య ) ?
పేర్ల దాక వచ్చాం కదా, భరత శత్రుగ్నుల ఇల్లాల్ల పేర్లు కూడా చెప్పండి?
5. చాంద్రమాన మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి నాడు వచ్చే పండుగేదో ?
6. చదరంగం కనిపెట్టింది ఎవరని అంటారు (మన పురాణాల లోని వ్యక్తే )?
7. జటాయువు , సీతని ఎత్తుకుపోతున్న రావణుని తో పోరాడి ఇక్కడ పడి చనిపోయిందట. ఎక్కడో తెలుసా?
8. చిట్టెలుక ని విడదీసి వ్రాస్తే ఏమవుతుందో తెలుసా? ఎ సంధి కూడా చెప్తే మంచిది .
9. జనక రాగాలు ఎన్నో తేలుసా?
10. తెలుగు అజంత భాష కదా! ప్రపంచంలో ఇంకొక భాష కూడా ఉంది ఇలానే. ఆ భాష ఏదో తెలుసా?
వీటికి సమాధానాలు రేపు అంటే 9th Apr 2008 సాయంత్రం ఇవ్వబడును.
ముఖ్య గమనిక : పైన ప్రశ్నలలో కొన్ని తప్పులు దొర్లాయి.. వాటిని సవరంచి తిరిగి ప్రచురిస్తున్నాను.
8 వ ప్రశ్నకి సమాధానం చెప్పిన వారికి పరుచూరి శ్రీనివాస్ గారు బహుమతి ఇస్తానన్నారండి. త్వరపడండి మొదటి కరెక్టు సమాధానానికి మాత్రమె.
9 comments
చిట్టెలుక - ప్రౌఢ వ్యాకరణానుసారం "చిట్టి + ఎలుక" -ఇది సఙ్నా వాచకం కాబట్టి సంధి "నిత్యం"... బాలవ్యాకరణం ప్రకారం "చిఱు + ఎలుక"..ఇక మీరే నిశ్చయించుకోండి
మిగతావి తీరికగా తరువాత
1.శుకుడు పరీక్షిత్ మహారాజుకు.
2.అశ్వథ్థామను
3.హాలుడు
4.సీత తల్లి పేరు గుర్తు లేదు కానీ మాండవి,శ్రుతకీర్తి.
5.
6.
7.
8.చిఱు+ఎలుక ద్విరుక్త 'టాకార సంధి.
9.72
10.ఇటాలియన్ అనుకుంటా
Just typed the answers whatever I know right now.
చంద్రమౌళి గారు, అంత పెద్ద బిరుదులు ఎందుకులెండి ? ప్రతి ప్రశ్నకి నాకు తెలిసిన విషయాలు తప్పక విశదీకరిస్తాను.
శీర్షిక కొనసాగించేది నెజ్జనుల ఆసక్తి మీద ఉంటది.
1. పరీక్షిన్మహారాజుకి శుకుడు చెప్పాడని సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. ఏమైనా సవరణలు ఉన్నయంటారా?
2.సైంధవుడు. తెల్లవారేలోగా అర్జునుడు చంపుతానని ప్రతిన బూనింది సైంధవుడి గురించే! అదీ అభిమన్యుడి చావుకి కారణమయ్యాడనే!
3. గాధా సప్త శతి ని రచించింది హాలుడు.
4. సీత పెంపుడు తల్లి(జనక మహారాజు భార్య) పేరు రత్నమాల. భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు...మాండవి, శ్రుతకీర్తి. వీళ్ళిద్దరూ సీతకు చెల్లెళ్ళ వరస. కజిన్స్.
5. రెండు మూడు కాలెండర్లు చూసినా తెలియలేదు. ఏ పండగా కనపడ లేదు. గంటల పంచాంగం చూడాలేమో. మీరే చెప్పాలి ఏం పండగో!
6. ఇదీ తెలీయలేదు. విష్ణువని ఊహిస్తున్నా! ఆయనేగా తీరిగా లక్ష్మీ దేవితో చదరంగం ఆడుతుంటాడు.
7.నాకు తెలిసి వినుకొండ(గుంటురు జిల్లా). ఇక్కడే సీత కేకలు జటాయువు కొండ మీద నుంచి విన్నాడని( అదే విన్న కొండ. కాల క్రమేణా వినుకొండగా మరిందని చెపుతారు), రావణుడితో యుద్ధం చేసాడని అక్కడి కొండ మీది రామాలయంలో స్టల పురాణం చదివాను.
8. చిరు+ ఎలుక = చిట్టెలుక. ద్విరుక్త టకార సంధి.
9.జనక రాగాలు 72.
10. అసలు ప్రశ్న అర్థం కాలేదు. అంటే, అజంతా భాష
ప్రపంచంలో ఇంకోటి ఉందనా?
ఇంతకీ, ప్రశ్నలే గాని, బహుమతులేం లేవా? అన్యాయం సుమండీ!
very intrestig.
please share answers
ఎక్కడో మీరు రాసిన కామెంటుకి నా సమాధానం ఇక్కడ ఇస్తున్నానండి.ఉల్లం చొక్కా ఆరబోసే వయసే అన్నారు.కానీ అది "ఉల్లం చక్కా ఆరబోసే".ఉల్లము అంటే మనసు,చక్కా ఆరబోసే అంటే సరిగా ఆరబోసే అని.మొత్తం అర్ధం ఏమిటంటే మనసుని సరిగా చూపించే వయసు అని.
1. పరీక్షిన్మహారాజుకి శుకుడు చెప్పాడని పురాణాల ప్రకారం చెపుతారు.
2.సైంధవుడిని.
3.హాలుడు
4.సీత పెంపుడు తల్లి పేరు రత్నమాల. భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు...మాండవి, శ్రుతకీర్తి.
5.మహా శివరాత్రి
6.శ్రీ మహా విష్ణువా?
7.నాకు తెలిసి వినుకొండ (గుంటూర్ జిల్లా). సీత రోదన కొండ మీదినుంచి 'విన్న కొండ ' కాబట్టి, ఇది విన్న కొండ...కాల క్రమేణా వినుకొండగా మారిందని , కొండ మీద రామాలయంలోని స్థల పురాణం. ఇక్కడే జటాయువు ఫోరాడింది.
8. చిరు + ఎలుక = చిట్టెలుక. ద్విరుక్త టకార సంధి.(సంధి సూత్రం అక్కర్లేదుగా)
9. జనక రాగాలు 72.
10. ఇటాలియన్ ?
అనామకుడు గారు, పేరు చెప్తె బాగుండేదెమో?
రాధిక గారు, నాకు కరెక్ట్ అర్థం చెప్పినందుకు నెనర్లు.
సుజాత గారు, జవాబులు వచ్చెసాయి చూడండి. అవును ఈ రత్నమాల ఎవరు? చూస్తె ఎదొ పౌరాణిక సినిమాలొ పాత్రలా ఉంది.
విహారి గారు, సమాధానాలు వచ్చయి చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
బూజు దులుపండి
వీడెవడండి బాబు

- దైవానిక
- సూర్యుని కిరణం నేను, సముద్రపు అలను నేను, నింగిలోని పక్షిని నేను, నేలలో వృక్షం నేను, గాలిలో సువాసన నేను, అగ్నిలో సెగను నేను, ఉరుములో శబ్దం నేను, దీపపు వెలుగుని నేను, అన్ని కలిపి దేవతల దండుని నేను.
నేడే చూడండి!!
-
డిజర్వేషన్లు ఇస్తే చలితులు మతం మారరు. అవునా? – 104 నెలల క్రితం
-
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల9 నెలల క్రితం
-
Ashray5 సంవత్సరాల క్రితం
-
కొసమెరుపురచయిత ఓ హెన్రీ ఇంట్లో కాసేపు ....11 సంవత్సరాల క్రితం
-
కొబ్బరి చిప్ప .... శాపం13 సంవత్సరాల క్రితం
-
నవంబరు గడి16 సంవత్సరాల క్రితం
బంధుమిత్ర సపరివారం
చదవడానికెందుకురా! తొందర
