మరుగున పడ్డ కొన్నిఆచార-వ్యవహారాలు  

Posted by దైవానిక

నేను చాలా రోజులుగా ఈ టపా వ్రాద్దామనుకుంటున్నాను. మొన్నామధ్యన కాలెండర్ చూస్తుంటే "రథ సప్తమి" అని కనిపించింది. తారీఖు చూస్తే దాటి పోయింది. అయ్యో చిన్నప్పుడు ఎంచక్కా చిక్కుడుకాయ కూర తినేవాల్లమే అనుకున్నా. ఆ తెల్లవారు ఫిబ్రవరి 14. అంటె valentines Day అన్నమాట. అది మాత్రం మర్చిపొకుండా చేసుకున్నాం. ఇలా ఎన్నో అలవాట్లు, ఆచారాలు మర్చిపోతున్నాం. అవన్ని ఒకసారి నెమరువేయటమే నా ఈ చిన్ని ప్రయత్నం. అవి అలా ఎందుకు చేస్తారో మాత్రం నాకు తెలీదు సుమండి. అందువల్లె అవి అందరికి గుర్తుండవు అనుకుంటా!!!!!!!

ముందుగా రథ సప్తమి. చాలా ప్రాంతాలలో ఉదయాన్న, చిక్కుడు ఆకులు తలమీద పేట్టి స్నానం చేస్తారు. ఇక చిక్కుడు కాయ కూర మాత్రం తప్పనిసరి. ఇది చంద్రమాన మాఘ శుక్ల సప్తమి నాడు వస్తుంది. అంటె, సుమారుగా ఫిబ్రవరి, మార్చి కాలంలో అన్నమాట.

ఇక తరువాతది తొలి ఏకాదశి. ఆ రోజు తప్పకుండా పేలాల పిండి తినేవాళ్ళము. పేలాలు కూడా వేంచిపెట్టే వాళ్ళు. పేలాలు అంటే తెలియని వాళ్ళకి, వాటిని popcorn అంటారు. ఇది చాంద్రమాన ఆషాడ శుక్ల ఏకాదశి నాడు వస్తుంది. అంటే, జులై ఆగష్టు కాలంలో అన్నమాట. రైతన్నలకు ఇది పెద్ద పండగ. ఈ రోజు తరువాతే నాట్లు ప్రారంభించేవారు. ఇక ఇంట్లోనే popcorn దొరుకుతుంది అంటే, పిల్లలందరికీ మహా సరదా.

అట్లతద్దె అంటే చాలామందికి తెలుసును. కాని ఆరోజు అట్లు తినడమే కాకుండా ఇంక వేరేవి చేస్తారు అని తెలీదు. మా చిన్నప్పుడు ఇంటి దూలాలకి పెద్ద పెద్ద ఉయ్యాలలు కట్టేవాళ్లు. ఇంక ఉయ్యాలలు జంపాలలే. పిల్లల ఆనందానికి హద్దులే ఉండవు. ఇంట్లోనే ఉయ్యాలలు, అవి దూలాలకి వేలాడేవి. గంటలు గంటలు ఉయ్యాలలు ఊగేవాళ్లము. అవి తీసేస్తుంటే ఇంక ఏడుపులు పెడబొబ్బలు. ఇది చంద్రమాన ఆశ్వయుజ బహుళ తదియ నాడు వస్తుంది. అంటే సుమారుగా సెప్టెంబర్-అక్టోబర్ లో అన్నమాట.

దీపావళి అందరికి తెలిసిన పండుగే. కాని ఆరోజు మతాబులు కాల్చడం కాకుండా వేరేవి కూడా చేసేవారు. మగపిల్లలు అయితె దివిటిలు తిప్పేవాళ్ళు . గోగేన చెట్టు మండలకి ఒక పక్క మంట అంటించి, చేతులతో తిప్పడం. వాటి మీద నుంచి దాటించడం చేసేవారు. ఇక ఆడ పిల్లలకి, పల్లేరు కాయలో దీపం పెట్టి, దానిని తాటాకు తో చేసిన ఒక holder లాంటి దానిలో పెట్టి , చుట్టూ తిప్పి ద్రిష్టి తీసేవారు . ఇక ఈ కార్యక్రమం అయితె ఇక మతాబులే మతాబులు. దీపావళి ఎప్పుడొస్తుందో అందరికి తెలిసిందే. అది చంద్రమాన ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంటే సుమారుగా అక్టోబర్-నవంబర్ ప్రాంతంలో అన్నమాట.

కోర్ల పౌర్ణమి, ఇది చాల మందికి తెలిసి ఉండకపోవోచ్చు. ఆ రోజు ఉదయాన్నే లేచి, పళ్ళు తోముకొని కుక్కలకి ఉండ్రాళ్ళు కొరికి వేసేవాళ్ళము. ఇది చెయ్యాలంటే ఎంత సరదానో మాటల్లో చెప్పలేను. ఈ రోజుకి కొంత మంది ఇది చేస్తున్నారు కాని ఉండ్రాళ్ళ బదులు ఇడ్లిలు వాడుతున్నారు. ఇది చంద్రమాన మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది. అంటే సుమారుగా డిసెంబరు- జనవరి ప్రాంతంలో.

కార్తిక మాసం, మన తెలుగు వారికీ ఎంతొ విశిష్ట మాసం. నోములు, వ్రతాలు చాలా చేస్తుంటారు. కార్తిక సోమవారము, కార్తిక పౌర్ణమి లాంటివి కొన్ని. కాని పిల్లలకు ఇష్టంగా చేసేది , ఉసిరి చెట్టు కింద వనభోజనాలు . అడివిలోకి వెళ్లి , ఒక ఉసిరి చెట్టు చూసి, దాని దగ్గర మకాం వేసి, వంటలు చేసి, తిని , సరదాగా ఆటలు ఆడి వచ్చేవాళ్ళు . అబ్బ ఎంత సంబరంగా ఉండేదో. ఇంకా కార్తిక మాసానికి, ఉసిరికి చాల బంధం ఉంది. తులసి కల్యాణం కూడా ఈ మాసంలోనే చెసేది. కన్నడిగులకి, కొంకిని వాళ్ళకి పెద్ద పండుగ. చాంద్రమాన కార్తీక శుక్ల ఏకాదశి/ద్వాదశి నాడు వస్తుంది. తులసి చెట్టు చుట్టూ ఉసిరి మండలతో పందిళ్ళు వేసి తులసి కల్యాణం చేస్తారు. ఇక పిండి వంటలకు ఏ మాత్రం కొదవుండదు.

ఇప్పటికే చాల చెప్పినట్టున్నాను. ఇంకా గుర్తొస్తే తరువాత టపాలో వ్రాస్తాను

This entry was posted on 1, ఏప్రిల్ 2008, మంగళవారం at 1:57 PM . You can follow any responses to this entry through the comments feed .

6 comments

చిన్నప్పుడు మా ఇంట్లో వీటిలో చాలా పండగలు చేసుకునేవాళ్ళం. రథసప్తమి, తొలిఏకాదశి, దీపావళికి దివిటీలు తిప్పడం, ఇంకా పోలాల అమావాస్య. ఈ సిటీలైఫ్ లో పడినతర్వాతే...

మర్చిపోయిన పండగలని గుర్తుచేసినందుకు థాంక్స్.

1 ఏప్రిల్, 2008 5:13 PMకి
అజ్ఞాత  

దివిటీలు తిప్పడం మా అమ్మమ్మ చేయించేది మా చేత. అయితే ఆడా, మగా అందరమూ చేసే వాళ్ళము.
నాకు చివరి మాటలు మాత్రమే గుర్తున్నాయి, "మళ్ళీ వచ్చే నాగుల చవితి" అంటూ ముగించే వాళ్ళం. కొన్ని టపాసులు మిగుల్చుకుని మళ్ళీ నాగుల చవితికి తప్పకుండా కాల్చే వాళ్ళం.
ఇంకా అట్ల తిద్దికి నాకు బాగా గుర్తున్నదీ, నచ్చినదీ, తెల్ల వారక ముందే లేచి అన్నం తినేసి (అట్లు అప్పుడు తినే వాళ్ళామో, తర్వాత తినే వాళ్ళమో గుర్తు లేదు) ఇక అప్పట్నించీ రోజంతా ఆటలు.

1 ఏప్రిల్, 2008 7:17 PMకి

సిటీలో మనం ఎంత దేవులాడినా, మన చిన్నప్పుడు ఇంట్లో చేసుకున్న పండగల నాటి సహజ సిద్ధ వాతవరణం కొరవడినట్లనిపిస్తుంది నాకైతే! అవును, అట్లతద్దులూ, తొలేకాదశి రోజు జొన్న పేలాలతో చేసిన పిండి...ఆకు రుబ్బి పెట్టిన గోరింటాకు...అన్నీ మర్చి పోకుండా జరుపుకోవాలండీ! ఇలా ఒకళ్ళకొకళ్ళు గుర్తు చేసుకునైనా సరే! లేకపోతే, మన పిల్లలకు అవేమిటొ తెలియకుండా పోతాయి.

లలిత గారు, ఆ ముందు రెండు పదాలూ.."దివ్వి దివ్వి దీపావళి ."

2 ఏప్రిల్, 2008 7:47 AMకి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
3 ఏప్రిల్, 2008 8:45 PMకి

చాలా బావుంది. మరిచ్పోతున్న విషయాలు చాలా గుర్తు చేశారు.

4 ఏప్రిల్, 2008 8:01 PMకి
అజ్ఞాత  

మీరు చెప్పిన పేలాల పండగ, కోర్ల పౌర్ణమి ( మా అమ్మ ఇప్పటకి కూడా ఆ రోజు ఫొన్ చేసి, యి రోజు కుక్కల కి కుడుములు వేస్తున్నాము అని చెపుతారు), ఇంకా శివరాత్రి కి జాగారం, వుపవాసం, నాగుల చవితి కి వుపవాసం వుంటే పెళ్ళి అవుతున్ది అని..కనుమ రోజు కంచము లో యెముక తొ కొడితె కాశి లో గంట కొట్టినట్లు అని మాంసము తినిపిచ్హే వాళ్ళు..వినాయక చవితి వస్తుంటే పిల్లల కి స్కూల్లో రెండు రోజుల నుండె పండగ..మన బొమ్మలు మనమే వేసుకొని పూజ చేసుకోవాలి అని..హ్హహ్హహ్హ.. యీ రోజుల్లో యిప్పుడు యివి అన్ని యెవరు చేస్తున్నారు అన్డి..చాలా సంథోసం అండి మా బాల్యపు రోజులు గుర్తు చేసినన్దుకు...

4 ఏప్రిల్, 2008 9:02 PMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి