పొరిగింటి పుల్లకూర  

Posted by దైవానిక

నేను మా నాన్నగారిని daddy అని పిలుస్తాను. మొన్నామధ్య నా స్నేహితుడు ఒకడు(అతను అరవం వాడు) మీ నాన్నని పశ్చాత్య దెశీయులు పిలిచినట్టుగా dad అని ఎందుకు పిలుస్తావు అని అడిగాడు. ఎందుకు అని అడిగితె ఎమి చెప్తాను. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అలానే పిలుస్తున్నాను. నాకు అది మన భాష కాదు అని తట్టనే లేదు. వాడు కూడ హైదరాబాదు లొ పుట్టి పెరిగాడు. నువ్వేకాదు నా స్నేహితులు చాలా మంది ఇలానే పిలుస్తారు అని కూడా చెప్పాడు. అప్పుడు నేను ఆలోచిస్తె నాకు అనిపించింది. నా తెలుగు స్నేహితులు చాలా మంది Daddy అని పిలుస్తారు. అలా పిలువని వాళ్ళలో చాలా మంది అమ్మ-నాన్న పెద్దగా చదువుకోలేదు. మెల్లమెల్లగా అందరు చదువుకుంటె ఇంక అమ్మ, నాన్న అనె పదాలు ఎక్కడ వినపడవేమొ? నిఘంటువు లోనుంచి తీసివెయాల్సిన అగత్యము రావొచ్చు. అది తలుచుకుంటేనె భయం వెస్తుంది.

నేను REC లొ చదువుకున్నాను. అక్కడ అన్ని రాష్ట్రాల వారు వుంటారు. ప్రతి రాష్ట్రానికి కొంత quota వుంటది. మన ఆంధ్రా quota నుంచి తెలుగు మాతృభాషగా లేనివారు వస్తుంటారు. అలాగె, వెరే రాష్ట్రాల quota నుంచి తెలుగు వారు వస్తుంటారు. ఆటువంటి వారికి తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు. వారి తెలుగు విన్న మనకి తెలుగు మీద, జీవితం మీద కూడ విరక్తి కలిగే అవకాశం వుంది. వారు వాల్ల అమ్మ నాన్న తోటి కూడ అంగ్లంలోనె మాట్లాడతారు. ఈ విధంగా మాతృభాష కనుమరుగవుతుంటె చివరకు ఎంత మంది మిగులుతారా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి కేవలం తెలుగుదేనా లేక ఇతర భాషలకు వర్తిస్తుందా అంటె, పెద్దగా వర్తించదు అనె చెప్పాలి. కన్నడిగలు మినహాయించి దాదాపు మిగతావారు మాతృభాషా ప్రియులె.

తెలుగువారికి పరాయిది ఎదైనా మహాప్రీతిపాత్రం. అందుకే అమెరికాలో వున్న భారతీయులలో తెలుగువారె అధికం. మా పిల్లలు mom dad అని పిలుస్తారు అని చెప్పుకోవడం మహా సరదా. మా పిల్లలు అమెరికాలొ వున్నారు అని చెప్పుకోవడం గర్వకారణం. నేను సెలవులకి, పండుగలకి ఇంటికి వెళితే, పొరిగింటివారు, బంధువులు అందరు అడిగేది ఒకె ఒక ప్రశ్న. అమెరికాకి ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడ లేనిది, అక్కడ వున్నది ఎంటి? మన వాళ్ళు మన నుంచి దూరంగా వుండటము ఇష్టమా?

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంతమంది తెలుగు వారము అన్ని దేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నాము కదా, అక్కడ అందరికి తెలుగు నేర్పించేస్తె? అప్పుడు తెలుగు అంతరించి పొతుంది అన్న బెంగ వుండదు. అప్పుడు తెలుగు mandarin భాష కంటె ఎక్కువ పాఠకులను సంపాదించి ప్రపంచములో చిరస్థాయిగా నిలుస్తుంది. "కలలా కరగడమా జీవితాన పరమార్థం" అన్నాడు సిరివెన్నల సీతారామశాస్త్రి. కావున కలలు ఆపేసి, తెలుగువారందరం తెలుగులోనె మాట్లాడుదాం. పిల్లల చేత అమ్మ-నాన్న అని పిలిపించుకుందాం.

This entry was posted on 5, డిసెంబర్ 2007, బుధవారం at 1:34 PM . You can follow any responses to this entry through the comments feed .

7 comments

బాగా చెప్పారు.

2 జనవరి, 2008 7:18 PMకి

నిజమే. నాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ల అత్తగారి గురించి చెప్పేటప్పుడు మా మదరిన్‌ అంటూ చెపుతుంది.

3 జనవరి, 2008 12:04 AMకి

Hmm... మరీ ఈ పిలుపులు మారడం వల్ల తెలుగు కి జనాలు దగ్గరౌతారని మాత్రం నాకు అనిపించదు. నాకూ తెలుగంటే ఇష్టమే... మా నాన్న కీ ఇష్టమే... ఇద్దరం ఇంట్లో కి తెలుగు పుస్తకాలు తెచ్చుకున్న వాళ్ళమే. కానీ... మా నాన్న ని Daddy అనే పిలిచేదాన్ని... అమ్మని అమ్మ అనే అన్నా కూడా. చదువుకీ దానికీ సంబంధం ఉన్నదా అన్నది నాకు అనుమానమే. మా వాచ్మెన్ కూతురు - (వాళ్ళు చదువుకోలేదు) డాడీ అనే అంటుంది. పీహెచ్డీ చేసిన మా నాన్న కూతుర్ని నేనూ డాడీ అనే అంటాను. అది అలవాటు. అంతే... దానికి భాషాభిమానానికి సంబంధం లేదు.

11 జనవరి, 2008 9:18 AMకి

చదువరి గారు, రమ్య గారు ధన్యవాదములు.

సౌమ్య గారు, భాషాభిమానానికి డాడి అని పిలవడానికి సంబంధం లేదు అని నేను ఒప్పుకుంటాను కాని ఇలా ఒక్కొక్క పదము అలవాటు అయిపోతె... నాన్న అని పిలిచే వాళ్ళు లేకపొతే ఇక ఆ పదాన్ని పుస్తకాలలో చూడవలసినదేనేమో!!! చదువుతో మటుకు ఖచ్చితమైన సంబంధం వుందని నేను నమ్ముతాను. మీ వాచ్మన్ కూతురి మీద వేరే ప్రభావం ఎదైనా ఉండి వుండవచ్చు, మరియు ప్రస్తుత జనరేషన్ కు అవగాహన కూడా పెరిగింది.

11 జనవరి, 2008 11:36 AMకి

మా తమ్ముడున్నాడు అమెరికాలో.. వాడు అమ్మా నాన్నా అని పిలుస్తాడు మా పిన్నీబాబయ్యలని..
పెద్దయ్యి వేమూరివారిలా హార్వాడులో తెలుగు నేర్పుతాడోమోనని భ్రమ పడేరు..
వాడికి క అంటే ఖ తెలియదు.
కానీ అ అంటే ఆ తెలుసు (కనీసం ఒక్క రోజు).. ఎందుకంటే వాడికి నేను ఒక రోజు కూర్చో బెట్టి నేర్పాను.
మా పిన్ని నువ్వు చాలా బాగా నేర్పుతావు అంది..
కానీ వాడు మాత్రం, అ నుండి ఱ వఱకూ నేర్చుకుంటే, నీకు XBOX లేదు WII కొనిస్తానని మా చిన్నాన్న చెప్పినా ససేమిరా అన్నాడు..
వాడిని అః దాటించలేక పోయాను ఆఖరుకి.

ఋ కి మీ మిత్రుడు ఋషీ వున్నాడు కదా వాడి పేరు ఇలాగే పెద్ద పాముతో మొదలవుతుంది అని చెప్పా లాభం లేదు.

చెప్పొచ్చేదేఁవిటంటే..
అంగారం లో శృంగారం వుండదు...
మనది ఆకలి రాజ్యం, డబ్బు సంపాదించడం పరామధర్మము. ఇక్కడ భాషాభిమానానికి తావు లేదు.

8 ఫిబ్రవరి, 2008 11:29 PMకి
అజ్ఞాత  

తెలుగు భాష నేర్పించడంలో ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా విలువలు కనిపించవు. నిజం.
నా దృష్టిలో నాతో సహా నా లాంటి వారిని పీడించే సమస్య - పిల్లలకు తెలుగులో అందుబాటులో ఉన్న (లేని) ఆరోగ్య కరమైన వినోదం.

దాని కారణమూ ఆర్థిక పరమైనదే కావచ్చు.
అయితే స్వచ్ఛందంగా భాషా ప్రచారానికి, అభివృద్ధికీ ప్రయత్నిస్తున్న వారిలో పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నిస్తున్న వారెందరు? మాగంటి వారు, తెలుగుదనం వారు, ఆంధ్రభారతి వారు పిల్లల తల్లి దండ్రులకు ఉపయోగపడే సేకరణలను వారి వారి వెబ్ సైట్లలో పొందు పరుస్తున్నారు. ఇక తరవాతి అడుగు ఏమి వెయ్య వచ్చు?
అంతర్జాల పత్రికలలో పిల్లల కోసం ప్రత్యేకంగా శీర్షికలు ఉన్నాయా? ఉంచే ఆలోచన ఎవరైనా చేస్తున్నారా? నేనేమైనా సాయం చెయ్య గలిగితే చేస్తాను, అటువనంటి ఆలోచన రూపం దాల్చడానికి.
బ్లాగులు ఒక ప్రయోజనాన్ని సాధించగలవు.
భాష తెలిసిన వారికి భాషను అందించే ప్రయత్నం అలా సాగుతుండగా సమాంతరంగా భాషను భావి తరాల వారికి అందించి నేర్పించడానికి ఉన్న అడ్డంకులను ఎదుర్కొనడానికి భాషాభిమానులం ఏం చెయ్య గలం? ఆలోచిద్దాం. ముందడుగు వేద్దాం.

9 ఫిబ్రవరి, 2008 12:44 AMకి

ఓ పది రోజులక్రితం అనుకుంటాను, నా పక్క సీటులో సహోద్యోగితో ( పేరు నాగేశ్వర్) బాగా విసిగిన మేనేజర్ - కొంచం అశక్తత ధ్వనిస్తూ నాయనా నాగేశ్వరా అన్నారు. నాగేశ్వర్ మొహం లో కోపం బుస్సున పొంగింది నాయనా అన్నందుకు. "కొత్తగా తండ్రి వయ్యావుగా అందుకని అలా పిలిచారులే" అని నేను కలిపించుకున్నాను. నాగేశ్వర్ అన్నాడుకదా .. "వాడికి మాటలు రాగానే నాయనా అని ఎందుకు పిలుస్తాడు డాడీ అని పిలుస్తాడు కానీ". నాకు ఏమి అనాలో తెలియలేదు.

23 ఏప్రిల్, 2010 9:57 PMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి