మంచి-చెడు , విచక్షణ  

Posted by దైవానిక

నేను టపా వ్రాయడం ఇదే మొదలు. టపాలు చదవడం కూడ కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టాను. చిన్నప్పటి నుంచి తెలుగు అంటె మక్కువ ఎక్కువ నాకు. కాని అంతా అంగ్లీయం అవుతున్న రోజులు మరి. అంగ్లీయములో పడి కొన్ని రోజులకి తెలుగు చదవడమే మర్చిపోతాను అని భయపడుతున్న రోజులలో ఒక స్నేహితుడు పుణ్యమా అని టపాలు చదవడం మొదలు పెట్టాను. క్రమేనా వ్రాయాలి అని ఉత్సాహం పెరిగి మొదలు పెట్టాను . కాని దేని గురించి వ్రాయాలి అని తేల్చుకోవడానికి కాస్త సమయము పట్టింది. కొన్ని రోజుల క్రితం shantaram అనే అంగ్ల నవల పూర్తి చేసాను. అందులో మంచి చెడు గురించి చెప్పిన సిద్ధాంతము, తర్కము కూడ నాకు బాగా నచ్చింది. దానిలో చెప్పిన దానినే నేను తెలుగిస్తున్నాను.

Big Bang కల్పనానుసారం ఈ విశ్వమంతా ఒక భయంకరమైన explosion (తెలుగులో ఈ పదానికి సమాన పదము తెలీక) ద్వారా ఎర్పడింది. అది ఎంత త్వరగా జరిగింది, ఎంత పెద్దది అన్నది మన ఊహలకి అందనిది. దీనినే శాస్త్రవేత్తలు Big Bang అంటారు. దాని తర్వాత విశ్వం అంతా అణువు కన్నా చిన్న తుత్తుమురులుగా మారింది. తర్వాత విశ్వం చల్లపడి తుత్తుమురులు కలిసి అణువులుగా మారాయి. ఆణువులు కలిసి molecules అయ్యాయి. అవి మళ్ళి కలిసి తారలు అయ్యాయి. ఆ తారలు మళ్ళి పేలి కొత్త రకం అణువులు అయ్యాయి. ఆ అణువులు కలిసి కొత్త తారలు గ్రహాలు అయ్యాయి. ఇది ఈనాడు ప్రపంచములో చాలా మంది నమ్ముతున్న Big Bang కల్పన.

ఈ విశ్వంలో జరిగే ఈ సంఘటనలన్ని కాకతాళీయం కాని గుడ్డి వేటు కాని కాదు. విశ్వ వ్యాప్తికి ఒక నడవడి వుంది. అది సరళమైన పదార్థాల నుండి క్లిష్టమైనవి(complex) తయారు అవుతున్నాయి. సందర్భాలు అనుకూలిస్తే కొత్త కొత్త పదార్థములు తయారు అవుతున్నయి. మానవ ఉద్భవం కూడా ఇలానే జరిగింది. దీనికి అంతం ఎప్పుడు అంటె, విశ్వం అంతా ఒక కడపటి క్లిష్టత(Ultimate Complexity) పొందినపుడు. ఆస్తికులు దీనినె భగవంతుడు అనవచ్చును. నాస్తికులు దీనిని Ultimate Complexity అనవచ్చును. ఈ నడవడిలొ క్లిష్టతకు సహాయ పడునవి అన్ని మంచి. అడ్డుపడునవి అన్ని చెడు. ఒక పని మంచా? చెడా ? అని తెలుసుకోవడం ఎలా అంటె, అదె పని అందరము చేస్తె, అది విశ్వ క్లిష్టతకు సహాయపడుతుందా /లేదా అని ఆలొచించాలి. ఉదాహరణకి చంపడం మంచా లేక చెడా? అందరు చంపడం మొదలు పెడితె మనము ఒక్కరము కూడ మిగలం. ప్రస్తుత విశ్వంలొ మానవుడు అతి క్లిష్టమైన క్రమము. అటువంటి మానవ జాతి అంతరించి పొతె, విశ్వం భగవంతుడులొ(నేను ఆస్తికున్ని) ఎలా అంతర్లీనం అవుతుంది? కావున చంపడం అనేది చెడు. ఈ పై సూత్రాన్ని అనుసరిస్తె మంచి చెడుల మధ్య తారతమ్యం తెలుస్తుంది.

ఈ టపా కేవలం నాకు నచ్చిన సిథ్థాంతం మాత్రమే. ఏ ఒక్క మతానుసారమొ కాదు. మతము అన్నది మానవుడు సౄష్టించాడు అని మనము గుర్తించాలి.

This entry was posted on 27, నవంబర్ 2007, మంగళవారం at 2:53 PM . You can follow any responses to this entry through the comments feed .

6 comments

మంచి ప్రారంభం! తెలుగు బ్లాగు లోకానికి స్వాగతం.

5 డిసెంబర్, 2007 6:44 AMకి
అజ్ఞాత  

స్వాగతం

5 డిసెంబర్, 2007 10:37 AMకి

తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం...

5 డిసెంబర్, 2007 12:17 PMకి

ramdi ramdi ramdi dayacheyaMdi

5 డిసెంబర్, 2007 12:40 PMకి

అందరికి ధన్యవాదములు

5 డిసెంబర్, 2007 1:28 PMకి

బ్లాగ్లోకానికి స్వాగతం ..
మీ టపాలు బాగున్నాయి...
వ్యాఖ్యానించడానికి వరడు వెరిఫికేషను తీసేస్తే బాగుంటుంది.

8 ఫిబ్రవరి, 2008 11:20 PMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి