తన్నోడి నన్నోడెనా లేక నన్నోడి తన్నోడెనా  

Posted by దైవానిక in

ఎందుకో కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని డయిలాగులు అలా నోట్లో నానుతుంటాయి. చిన్నపిల్లలప్పుడయితే వాటి అర్థాలు కూడా సరిగ్గా తెలియవు. మజ్ను సినిమా మొదట చూసినప్పుడనుకుంటాను, చాలా రోజులు వాడిన డయిలాగు "కామా తురాణాం న భయం న లజ్జ". దాని అర్థం ఏమిటో తెలియని వయసు నాది. ఎవరేమన్న నోటినుంచి ఇదే డయిలాగు. చివరకి ఒకసారి మా అమ్మకి కూడా వినపడ్డది. అప్పుడు మా అమ్మ పిలిచి దాని అర్థం తెలుసా అని అడిగింది. నేను తెలీదన్నాను. అప్పుడు తెలీని పదాలు, అదికాక వయసుకిమించినవి మాట్లాడడం తప్పుకదా అని సముదాయించి పంపింది.

తర్వాత కొన్నాళ్ళకి సాగరసంగమం సినిమా చూసాను. కమల్ చెప్పిన డయిలాగులు, చెప్పిన తీరు భలే బాగా నచ్చెసాయి. ఈ సారి పట్టింది, " ఇలాంటి కామక్రీడలు చెయ్యడానికి వీళ్ళకి సిగ్గులేదు". ఇక ఇది నోటెమ్మట వస్తూనేవుంది. నోరుజారి అమ్మముందు కూడా అనేసాను. నోరు జారడానికి చెంప పగలడానికి పెద్ద సమయం పట్టలేదు.. ఈ పెద్దోళ్ళున్నారే, మా చిన్నోళ్ళని ఎప్పుడు అర్థం చేసుకోరు. ఏదొ పెద్దమాటలన్నానని చెంప పగలగొట్టడం ఏం న్యాయం అని బాగా ఆలోచించి ఏడ్చి పడుకున్నాను.
ఇంకొన్నాళ్ళకి, అప్పుడు నా వయసు 12-13 ఉంటుందనుకుంటాను, రాత్రి కలలో గట్టిగా "నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు" అని అరిచానంట. ఇక రెండు మూడు రోజులు క్లాసులు. అసలు పెళ్ళి ఊసులు రావడానికి కారణం రాబట్టడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి. కాని అసలు అరిచిన సంగతే గుర్తులేదు. ఇంకా కారణాలు ఎక్కడనుంచి చెబుతాను.
ఈ పై విషయాలు గమనించి, నాకు కామానికి అక్రమ సంబంధం ఉందనుకునేరు. అంతా కేవలం యాథృచ్చికమే.

సరే అసలు టైటిల్ విషయానికొస్తే, పాండవ వనవాసం సినిమా చూసినప్పుడు విన్న డవిలాగు అది. సావిత్రి బాగా బాధ పడుతూ చెప్పిన డయిలాగు. ద్రౌపదిని( అదే సావిత్రే లెండి) తీసుకురమ్మని ప్రాతిగామిని పంపిస్తాడు రారాజు. అప్పుడు ఈ విషయం కనుక్కురమ్మని సావిత్రమ్మ చెప్పే డయిలాగు ఇది.
" నా స్వామి తన్నోడి నన్నోడెనా లేక నన్నోడి తన్నోడెనా,".
ఈ డయిలాగు విన్నప్పుడు నేను, ధుర్యోధనుడు( అదే మన ఎస్ వీ ఆర్) ఒకలాగే ఆలోచించాము. ఎలా అయితే ఎంటి మొత్తానికి ఓడారా లేదా. అంతా టైం వేస్టింగ్ టాక్టిక్స్.
కాని రెండిటికి ఏంత తెడా ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది. అంటె ధర్మరాజు తను ఓడిపోవడం వల్ల ద్రౌపది ఆటోమేటిక్ గా రారాజుది అవుతుంది. అలాంటప్పుడు ధర్మవిధిత(lawful bid). కాని, ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పెట్టి ఓడిపోతే, అసలు ధర్మ రాజుకు ద్రౌపదిని పెట్టే హక్కు ఎక్కడిది. ద్రౌపది తన ఒక్కడికే భార్య కాదే, కాబట్టి తను అధర్మవిధిత( unlawful bid). ఇది వికర్ణుడు చెప్పే వాదం. ఏదేమయితేనేం ఇందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది. అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు.

This entry was posted on 15, జులై 2008, మంగళవారం at 7:24 PM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

4 comments

నాకు కూడా "దాన వీర శూర కర్ణ" లో బాగా నచ్చిన సంభాషణ ఇది. కాకపోతే ఇది ఇంకో రూపం లో కూడ ఉన్నట్లుంది. "తన్నొడ్డి నన్నొడ్డెనా లేక నన్నొడ్డి తన్నొడ్డెనా"..ఇక్కడ ఒడ్డటం అంటే పందెం పెట్టటం అని అర్థం.

17 జులై, 2008 5:17 PM

దైవానిక,
మీరు అమాయకంగా నైనా భలే డైలాగులు పట్టుకున్నారండి, నవ్వలేక చచ్చాను మీకు పట్టుకున్న డైలాగులు చదివి!

17 జులై, 2008 7:15 PM

అబ్బో మీరు డవిలాగుతో చంపేసారు గా.

17 జులై, 2008 11:54 PM

for Self Employment visit: *** www.indiaonlines.in **** www.4job.in

23 సెప్టెంబర్, 2017 11:59 PM

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి